అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మియామీ నగరంలో 12 అంతస్తుల భవనం కుప్పకూలింది. మొత్తం 136 ఫ్లాట్లలో 55 ఫ్లాట్లు కూలినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా… 159 మంది ఆచూకీ లభ్యం కాలేదు. అర్ధరాత్రి ఒకటిన్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది… సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చాంప్లైన్ టవర్స్ సౌత్ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల క్రితం పగుళ్లను గుర్తించినట్టు స్థానికు ఇంజనీర్లు చెప్తున్నారు. మరమ్మతులు చేసేలోగానే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. మరోవైపు చుట్టు పక్కల ఉన్న భవనాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.