Site icon NTV Telugu

పాకిస్థాన్‌లో భారీ పేలుడు

పాకిస్థాన్‌లో భారీలు పేలుడు సంభ‌వించింది.. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌ పాన్ మండి ద‌గ్గ‌ర జ‌రిగిన భారీ బాంబు పేలుడులో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 20 మందికి పైగా తీవ్ర గాయాల‌పాలైన‌ట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఇక‌, ఈ ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న పోలీసులు.. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. గాయ‌ప‌డిన‌వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.. బాంబు పేలుడుపై మీడియాతో మాట్లాడిన లాహోర్ పోలీసులు.. ముగ్గురు మ‌ర‌ణించిన‌ట్టు వెల్ల‌డించారు.. ఇక‌, ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారతీయ వస్తువులు అమ్మే ప్రాంతం కావ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.. ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకుని ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్టుగా భావిస్తున్నారు. అయితే, ఈ పేలుడుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఉగ్ర సంస్థ బాధ్య‌త వ‌హించ‌లేదు. అయితే, పోలీసుల ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో.. ఓ బైక్‌లో అమ‌ర్చిన బాంబు పేలిన‌ట్టు చెబుతున్నారు.

Read Also: 40 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ప్రేమ జంట‌కు పెళ్లి.. ఎందుకో తెలుసా..?

Exit mobile version