NTV Telugu Site icon

NASA: సునీతా విలియమ్స్ లేకుండా సెప్టెంబర్ 6 తర్వాత భూమిపైకి స్టార్‌లైనర్..

Boeing Starliner

Boeing Starliner

NASA: బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా ఇటీవల సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే, అనూహ్యంగా స్టార్‌లైనర్‌లో లీకులు ఏర్పడటంతో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే చిక్కుకుపోయారు. ఆమె వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఆమె అంతరిక్షంలోనే మరో ఆరు నెలల పాటు ఉంటుందని ఇటీవల నాసా ప్రకటించింది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 6 తర్వాతే స్టార్‌లైనర్ భూమిపైకి వచ్చే అవకాశం ఉందని నాసా ప్రకటించింది. స్టార్‌లైనర్ అన్ డాకింగ్ ప్రక్రియ ఈ తేదీ కన్నా ముందు జరిగే అవకాశం లేదని గురువారం చెప్పింది. జూన్ నెలలో బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్యూల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ క్రూ-9 వెహికిల్ ద్వారా భూమి మీదకు తిరిగి రానున్నారు.

Read Also: Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..

స్టార్‌లైనర్‌లో ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో సమస్యలు ఏర్పడటంతో వ్యోమగాములు ఐఎస్ఎస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ నెలలో అక్కడికి వెళ్లిన 24 గంటల్లో క్యాప్యూస్‌లో వరసగా అవాంతరాలు ఎదురయ్యాయి. థ్రస్టర్లు విఫలమయ్యాయి. వీటిని ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో స్టార్‌లైనర్ ద్వారా సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్‌ని తీసుకురావడం ప్రమాదకరమని నాసా భావిస్తోంది. స్టార్‌లైనర్ వైఫల్యం కారణంగా 8 రోజుల్లోనే భూమి మీదకు తిరిగి రావాల్సిన వారు ఫిబ్రవరి 2025 వరకు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తోంది.

స్టార్‌లైనర్ భూమికి తిరిగిరావడం కోసం అన్‌డాకింగ్ ప్రక్రియ నుంచి మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్‌లో ల్యాండింగ్ వరకు సుమారు 6 గంటలు పడుతుందని నాసా ఒక బ్లాగ్‌లో తెలియజేసింది. నైరుతి అమెరికాలోని సురక్షితమైన ల్యాండింగ్ కోసం అన్ డాకింగ్, రీ ఎంట్రీ, పారాశూట్ సాయంతో ల్యాండింగ్‌కి అసవరమైన విన్యాసాలు అన్ని గ్రౌండ్ టీమ్ ద్వారా రిమోట్‌గా అంతరిక్ష నౌకకు దిశానిర్దేశం చేస్తాయి.