Site icon NTV Telugu

Blasts: వరుస పేలుళ్లు.. ఐదు ప్రాంతాల్లో బాంబుల మోత..

Blasts

Blasts

వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌ ఉలిక్కిపడింది… ఏకంగా ఐదు బాంబులు పేలడంలో అంతా ఆందోళనకు గురయ్యారు.. కాబూల్‌ సహా ఐదు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.. ఈ పేలుళ్లలో మొత్తం 20 మందికి పైగా మృతిచెందారు.. ఇక, ప్రార్థనా మందిరంలో జరిగిన భారీ పేలుడులో 65 మంది గాయాలపాలయ్యారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని మసీదులో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలు అయ్యాయి..

Read Also: Jogi Ramesh: గృహనిర్మాణానికి నిధుల కొరత లేదు.. 28న లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం..

ఇక, పశ్చిమ కాబూల్‌లోని ప్రధానంగా షియా హజారా ప్రాంతంలోని ఉన్నత పాఠశాలలో పేలుళ్లు సంభవించిన రెండు రోజుల తర్వాత.. మళ్లీ పేలుళ్లు జరిగాయి.. ఇవాళ కనీసం ఆరుగురు వ్యక్తులు మరణించారు మరియు 11 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. ఉత్తర ఆఫ్ఘన్ నగరంలోని మజార్-ఎ-షరీఫ్‌లోని షియా మసీదులో గురువారం జరిగిన పేలుడులో కనీసం 20 మంది మరణించి ఉంటారని స్థానిక తాలిబాన్ కమాండర్ తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని మైనారిటీ కమ్యూనిటైన షియాలను స్లామిక్ స్టేట్‌తో సహా సున్నీ మిలిటెంట్ గ్రూపులు తరచూ టార్గెట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version