NTV Telugu Site icon

Pakistan: బిన్‌ లాడెన్‌ సన్నిహితుడు అల్‌ఖైదా ఉగ్రవాది అమీనుల్‌ హఖ్‌ అరెస్టు

Pak

Pak

Pakistan: ప్రపంచ దేశాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి చివరకు అమెరికా చేతిలో దారుణంగా హతమైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు, అల్‌ఖైదా ఉగ్రవాది అమీనుల్‌ హఖ్‌ ను అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉగ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) ఆధ్వర్యంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా సీటీడీ పంజాబ్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమీనుల్ హఖ్‌ను ప్లాన్ ప్రకారం ఆపరేషన్‌ నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపాడు.

Read Also: Tamil Movies: టాలీవుడ్ పై తమిళ సినిమాల దండయాత్ర..

కాగా, అల్‌ఖైదా ఉగ్రవాది అమీనుల్‌ హఖ్‌ 1996 నుంచి ఒసామా బిన్‌ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పంజాబ్‌ ప్రావిన్సు అంతటా విధ్వంసకర చర్యలకు కుట్రలు పన్నినట్లు ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు చెప్పుకొచ్చారు. అమీనుల్ హఖ్‌పై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ కోసం రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. తొందరలోనే అతడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు.