NTV Telugu Site icon

Bill Gates: ప్రధాని మోడీపై బిల్‌గేట్స్‌ ప్రశంసలు..

Bill Gates

Bill Gates

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు మైక్రోసాప్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌.. కాలానికి అనుగుణంగా భారత ఆరోగ్యరంగం కొత్త పుంతలు తొక్కుతోందని అభినందించారు.. ఆరోగ్య రంగంతో పాటు, డిజిటల్‌ రంగం కూడా దినదినాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోడీని ప్రశంసించారు.. దేశాభివృద్ధిలో ఆరోగ్య, డిజిటల్‌ రంగాల ముఖ్యపాత్రను గ్రహించి వాటికి సముచిత స్థానం ఇవ్వడం అద్భుతమైన విషయంగా పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములు కావడం మా అదృష్టం అంటూ అమృతమహోత్సవ్ హ్యాష్‌ట్యాగ్‌ని జోడిస్తూ ట్వీట్‌ చేశారు బిల్‌ గేట్స్‌..

Read Also: Subhas Chandra Bose: మిస్టరీగానే సుభాష్ చంద్రబోస్ మరణం.. తెరపైకి కొత్త డిమాండ్‌

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు.. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తూ ఆరోగ్య సంరక్షణ మరియు డిజిటల్ పరివర్తనకు ప్రాధాన్యతనిచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీని నేను అభినందిస్తున్నాను. ఈ రంగాలలో భారతదేశం యొక్క పురోగతి స్ఫూర్తిదాయకంగా ఉంది.. ఈ ప్రయాణంలో #అమృతమహోత్సవ్‌లో భాగస్వాములు కావడం మా అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.. ఇక, జులైలో భారత్‌ సాధించిన కరోనా వ్యాక్సినేషన్‌ మైలురాయిని గుర్తించాడు బిల్‌ గేట్స్.. కోవిడ్‌కు వ్యతిరేకంగా 200 కోట్ల వ్యాక్సిన్‌లను అందించారు.. 200 కోట్ల వ్యాక్సినేషన్‌లను అందించిన మరో మైలురాయికి ప్రధాని మోడీకి అభినందనలు అంటూ ఆయన ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.