Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్ చేస్తున్నారు.. తాను 200 బిలియన్ డాలర్లు సహాయాన్ని ప్రతిజ్ఞ చేశారు.. ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.. 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం తాను 200 బిలియన్ల డాలర్ల సహాయం చేస్తానని పేర్కొన్న ఆయన.. తోటి బిలియనీర్లు కూడా తమ దాతృత్వ ప్రయత్నాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.. ప్రపంచ అభివృద్ధిపై బిల్ గేట్స్ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.. ప్రభుత్వాల నుండి విదేశీ సహాయంలో కోతలు కారణంగా నిధుల అంతరం ఉంటుందని హెచ్చరించారు. ఈ రానున్న 20 సంవత్సరాలలో తన ఫౌండేషన్ ద్వారా 200 బిలియన్ డాలర్లను పంపిణీ చేయాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇటీవలి మహమ్మారి ఓవైపు.. వాతావరణ మార్పుల వంటి అంశాలపై హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భవిష్యత్తు గురించి తాను ఇంకా చాలా ఆశావాదంగా ఉన్నానని చెప్పుకొచ్చారు..
Read Also: Terrorists: జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్!
ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, గేట్స్ మాట్లాడుతూ.. మీరు నన్ను స్వతహాగా ఆశావాద వ్యక్తి అని ఆరోపించవచ్చు… కానీ, నేను వాస్తవికంగా ఉన్నానని నేను భావిస్తున్నాను. రాబోయే రెండు దశాబ్దాలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆరోగ్యం, విద్య మరియు పేదరిక తగ్గింపులో గణనీయమైన మెరుగుదల సాధిస్తామనే నమ్మకాన్ని వెలిబుచ్చారు.. పెరుగుతున్న ఉద్రిక్తతలు.. పాశ్చాత్య ప్రభుత్వాలు విదేశీ సహాయంలో లోతైన కోతల మధ్య గేట్స్ ఆశావాద వైఖరి వచ్చింది. గురువారం ప్రచురించిన ఒక బ్లాగ్ పోస్ట్‌లో, ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల పెరుగుతున్న నిధుల అంతరాన్ని ఏ దాతృత్వ సంస్థ కూడా పూరించలేదని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలు తమ పేద ప్రజలకు అండగా నిలుస్తాయో లేదో అస్పష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, గేట్స్ తన నిబద్ధతలో దృఢంగా ఉన్నారు. రాబోయే 20 సంవత్సరాలలో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా 200 బిలియన్ డాలర్లు పంపిణీ చేయడానికి ఆయన ప్రణాళికలను ఆవిష్కరించారు.. ఆ తర్వాత ఫౌండేషన్ మూసివేయబడుతుందన్నారు..
ప్రసూతి మరియు శిశు మరణాలను తగ్గించడం, మలేరియా, పోలియో మరియు మీజిల్స్ వంటి వ్యాధులను నిర్మూలించడం.. మెరుగైన విద్య మరియు వ్యవసాయ సంస్కరణల ద్వారా లక్షలాది మంది, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలలో పేదరికం నుండి బయటపడటానికి వీలు కల్పించడంపై దృష్టిసారించాలన్నారు.. ప్రజలు ఆరోగ్యకరమైన, మరింత సంపన్నమైన జీవితాలను గడపడానికి సహాయపడే అవకాశాలు ఎన్నడూ లేవన్న గేట్స్.. సాంకేతికత, కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతిని ఎత్తి చూపారు. AIని “మాయా మంత్రదండం”గా చూడకూడదని హెచ్చరిస్తూనే.. ఇది ప్రపంచ ఆరోగ్యం మరియు అభివృద్ధిలో పురోగతిని వేగవంతం చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బిల్ గేట్స్..
