Site icon NTV Telugu

Joe Biden: ఇసుక బీచ్‌లో బైడెన్ పలుమార్లు తడబాటు.. వీడియో వైరల్

Joebiden

Joebiden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఆదివారం డెలావేర్‌లోని ఇసుక బీచ్‌లో గడిపేందుకు వెళ్లారు. అయితే బైడెన్ ఇసుకలో నడిచేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు బైడెన్ తుళ్లిపడబోయారు. అయితే భార్య జిల్ పట్టుకోబోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: GST Rates: కొత్త సంవత్సరంలో జీవిత, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న జీఎస్టీ?

81 ఏళ్ల బైడెన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మధ్యలోనే ఆయన అమెరికా అధ్యక్ష రేసు నుంచి నిష్క్రమించారు. అయితే వారాంతంలో గడిపేందుకు బైడెన్.. భార్యతో కలిసి ఇసుక బీచ్‌కు వెళ్లారు. అయితే అధ్యక్షుడు ఇసుకలో నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రథమ మహిళ జిల్ సపోర్టు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. 2025, జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ట్రంప్ విజయం సాధించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులంతా అభినందనలు తెలిపారు.

 

Exit mobile version