Site icon NTV Telugu

Biden- Trump Debate: ట్రంప్తో డిబేట్లో నిద్రపోయినంత పనైంది.. తడబాటుపై బైడెన్ రియాక్షన్..!

Biden Trump Debate

Biden Trump Debate

Biden- Trump Debate: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య బిగ్ డిబేట్ జరిగింది. అయితే, ఈ చర్చలో బైడెన్ చాలాసార్లు తడబాటు పడ్డాడు. ఆయన్ని పోటీ నుంచి తప్పించాలని కొన్ని వర్గాల నుంచి వాదనలు వినిపించాయి. ఇలాంటి సమయంలో తడబాటుకు గురైనట్లు స్వయంగా బైడెన్ ఒప్పుకున్నాడు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ చెప్పారు. వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ ప్రోగ్రాంలో మంగళవారం ఆయన ఈ కామెంట్స్ చేశారు. జెట్ లాగ్ వల్ల వచ్చిన అలసట వల్లే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు. అందుకే డిబేట్ లో సరిగ్గా వాదించలేకోపోయానని జో బైడెన్ వెల్లడించారు.

Read Also: Kalki2898AD: ఓరినాయనో.. త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా..!

అయితే, తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను ఈ సందర్భంగా కోరారు. దీన్ని సాకుగా భావించొద్దు.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలన్నారు. ట్రంప్‌తో జరిగిన డిబేట్ లో జో బైడెన్ పెద్దగా మాట్లాడలేకపోయారని శ్వేతసౌధం కూడా ఒప్పుకుంది. అంతమాత్రాన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని అనుకోవద్దని చెప్పింది. దేశాన్ని మరో నాలుగేళ్లు ముందుకు నడిపించే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపింది. డిబేట్ టైంకి అధ్యక్షుడు జలుబుతో ఇబ్బంది పడ్డారు.. గొంతులో కూడా సమస్య ఉందని అధికార ప్రతినిధి కరీన్ జీన్-పియర్ తెలిపారు.

Read Also: Mrunal Thakur: బాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టిన సీత

కాగా, ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ పలు సందర్భాల్లో అంగీకరించారని అధికార ప్రతినిధి కరీన్ జీన్- పియర్ గుర్తు చేశారు. గత మూడున్నరేళ్లుగా బైడెన్‌ అన్ని పనులు, బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారని చెప్పారు. అమెరికా ప్రజలకు సేవలందించడంలో బైడెన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జీవితాంతం అనేక సవాళ్లు ఎదుర్కొన్న ఆయనకు.. ఈ దశను దాటి ఎలా రావడమో కూడా తెలుసన్నారు. డిబేట్ లో ఎలా మాట్లాడామనేది ప్రధానం కాదు.. అధ్యక్షుడిగా ఎలా పని చేస్తామనేదే కీలకం అని అమెరికా అధికార ప్రతినిధి కరీన్ జీన్- పియార్ పేర్కొన్నారు.

Exit mobile version