NTV Telugu Site icon

US: అమెరికా కీలన నిర్ణయం.. కార్లలో చైనీస్ సాఫ్ట్‌వేర్ నిషేధించాలని ప్రతిపాదన

Softwarecrackdown

Softwarecrackdown

కార్లలో అమర్చే సాఫ్ట్‌వేర్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్లలో చైనీస్ సాఫ్ట్‌వేర్‌ను నిషేధించాలని అమెరికా ప్రతిపాదించింది. జాతీయ భద్రతా సమస్యలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనీస్ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇలాంటి కార్లను దేశం నుంచి నిషేధించాలని యూఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో మాట్లాడుతూ.. భద్రతా కారణాల దృష్ట్యా.. విదేశీ ప్రత్యర్థి వాహనాలను యూఎస్‌కు రాకుండా మూసివేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చైనీస్‌కు చెందిన అన్ని రకాలు కార్లపై నిషేధం విధించే చాన్సుంది.

ఇది కూడా చదవండి: Arvind Krishna: రోజుకు రూ. 45 లక్షల జీతం తీసుకుంటున్న తెలుగు తేజం!

చైనీస్ సాఫ్ట్‌వేర్‌పై బైడెన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫిబ్రవరిలోనే సంభావ్య ప్రమాదాలపై వైట్‌హౌస్ విచారణకు ఆదేశించింది. చైనీస్, రష్యా సహా ఇతర విదేశీ ప్రత్యర్థులు తయారు చేసే ఉత్పత్తులను నిషేధించే అవకాశం ఉంది. ప్రత్యర్థులు నిఘా కోసం సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నట్లు అంచనా వేస్తోంది. రహదారులపై అమెరికన్ల గోప్యత, భద్రతకు ముప్పు కలిగిస్తుందని వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో బ్రీఫింగ్‌లో తెలిపారు.

ఇది కూడా చదవండి: Renukaswamy Murder Case: రేణుకాస్వామి కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్..

ఇటీవల లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిపోయాయి. వీటిని తయారు చేసింది చైనాకు చెందిన సంస్థలే. తయారులోనే ఏదో జరిగిందని లెబనాన్ భావిస్తోంది. పేజర్లు, వాకీటాకీలు పేలి దాదాపు వందలాది మంది చనిపోయారు. అలాగే వందలాది మంది గాయాపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున అమెరికా.. చైనా సాఫ్ట్‌వేర్ నిషేధించాలని భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Anmol Ambani: అనిల్ అంబానీ కుమారుడిపై రూ.కోటి జరిమానా!