NTV Telugu Site icon

Joe Biden: అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం.. 37 మందికి క్షమాభిక్ష

Joe Biden

Joe Biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొద్ది రోజుల్లో పదవి నుంచి వైదొలగనున్నారు. దీంతో ఆయన చివరి రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు. ఫెడరల్‌ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించారు. పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చడంతో వారికి ఉపశమనం లభించినట్లయింది. ఇప్పటికే వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వందలాది ఖైదీలకు ఉపశమనం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో మరణశిక్ష పడిన వారికి జీవిత ఖైదీగా తగ్గించాలని అధ్యక్షుడికి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫెడరల్‌ మరణశిక్ష ఎదుర్కొంటున్న 40 మందిలో ఏకంగా 37 మందికి బైడెన్‌ శిక్ష తగ్గించారు. దీంతో ఖైదీల్లో సంతోషం వెల్లువిరిసింది.

ఇది కూడా చదవండి: Dead Body in Parcel: డెడ్ బాడీ హోమ్ డెలివరీ కేసులో వీడిన మిస్టరీ.. ఇన్ని ట్విస్ట్‌లా..?

2003 నుంచి ట్రంప్‌ అధికారం చేపట్టే వరకు ఫెడరల్‌ ఖైదీలకు మరణశిక్ష అమలు చేయలేదు. ఆయన అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే 13 మందికి శిక్ష అమలు చేశారు. చివరగా జనవరి 16, 2021న ట్రంప్‌ అధికారం నుంచి దిగిపోయే నాలుగు రోజుల ముందు చివరి శిక్ష అమలయ్యింది. ప్రస్తుతం నలభై మంది ఈ జాబితాలో కొనసాగుతుండగా.. వీరిలో 37 మందికి క్షమాభిక్ష లభించింది. బోస్టన్‌ మారథాన్‌ బాంబుదాడి కేసులో ఉన్న దోషితో సహా ముగ్గురికి ఉపశమనం లభించలేదు.

ఇది కూడా చదవండి: HYDRA: చెరువుల ఆక్రమ‌ణ‌ల‌పై ఫిర్యాదు.. రంగంలోకి రంగనాథ్

Show comments