NTV Telugu Site icon

Israel-Hezbollah: కాల్పుల విరమణను తిరస్కరించిన నెతన్యాహు.. దాడులు ఆపేదిలేదు..

Benziman

Benziman

Israel-Hezbollah: ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను నిన్న (గురువారం) ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు తోసిపుచ్చారు. తమ లక్ష్యాలను సాధించేవరకు హెజ్‌బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. లెబనాన్‌పై పూర్తిశక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. మేం మా లక్ష్యాలను సాధించేవరకు ఈ దాడులు ఆపబోమన్నారు. కాగా, హెజ్‌బొల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్‌ను ఖాళీ చేసిన పౌరులు తమ నివాసాలకు తిరిగి వెళ్లడం మాకు కీలకం అని బెంజమెన్ నెతన్యాహు అన్నారు.

Read Also: Sri Mahalakshmi Stotram: శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మీ ఇంట్లో ధన వర్షమే..!

కాగా, గురువారం మరో కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్‌ దాడిలో హెజ్‌బొల్లాకు చెందిన డ్రోన్‌ యూనిట్‌ కమాండర్‌ మరణించారు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని దాహియాలో ఈ కమాండర్‌ ఉన్న అపార్టుమెంటుపై ఇజ్రాయెల్‌ మూడు క్షిపణులతో దాడి చేసింది. వారం రోజుల్లో దాహియాపై ఇది ఇజ్రాయెల్‌ చేసిన నాలుగో మెరుపు దాడి చేసింది. ఈ వరుస దాదాపు 17 మంది హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్లను ఈ ప్రాంతంలోనే ఇజ్రాయెల్‌ చంపేసింది. బుధవారం రాత్రి లెబనాన్‌లోని బెకా లోయపై ఇజ్రాయెల్‌ సైన్యం.. ఐడీఎఫ్‌ చేసిన దాడుల్లో సుమారు 23 మంది సిరియన్లు మృత్యువాత పడ్డారు. మరోవైపు గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం సమీపంలోని ఓ స్కూల్ పై ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడిలో 11 మంది ప్రాణాలు మరణించగా.. 22 మందికి గాయపడ్డారు.