Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన నెతన్యాహూ..

  • ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన ఇజ్రాయిల్ ప్రధాని..
  • తనకు గతంలో క్యాన్సర ఉందని ప్రకటించిన నెతన్యాహూ..
  • ఇప్పుడు అంతా నయమైందని ట్వీట్..
Netanyahu

Netanyahu

Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. అయితే, ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి తాను పూర్తిగా కొలుకున్నట్లు నెతన్యాహూ ప్రకటించారు. యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో తన వార్షిక ఆరోగ్య నివేదిక బయటకు రాకుండా ఉండేందుకు, ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయకుండా ఉండేందుకు దీనిని 2 నెలల పాటు వాయిదా వేయాలని తానే అభ్యర్థించినట్లు నెతన్యాహూ ఒక ట్వీట్‌లో చెప్పారు.

ప్రస్తుతం దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం బాగానే ఉందని, శారీరక స్థితి బాగుందని, గతంలో నా ప్రొస్టేట్‌కు సంబంధించి చిన్న సమస్య ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా నయమైందని తెలిపారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి రెగ్యులర్ చెకప్‌ చేయించుకుంటున్నట్లు వెల్లడించారు.

Read Also: Malacca Strait: షాకింగ్‌..! హార్మూజ్‌ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్‌ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!

అయితే, ఇటీవల ప్రొస్టేట్‌లో ఒక సెంటీమీటర్ కన్నా చిన్న సైజులో ఒక మచ్చ గుర్తించినట్లు, దీనిని టెస్ట్ చేయగా ఇది ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ట్యూమర్‌గా తేలిందని, కానీ అది ఎక్కడికి వ్యాపించలేదు(మెటాస్టాసిస్ లేదు) అని చెప్పారు. నా వయసు ఉన్న వారిలో ఇది సాధారణమని చెప్పారు. దీనిని ఎదుర్కొనేందుకు రెండు మార్గాలు ఉన్నాయని- చికిత్స చేయకుండా కేవలం పర్యవేక్షణలో ఉండవచ్చు, చాలా మంది ఇలా జీవిస్తున్నారు, చికిత్స చేసి సమస్యను పూర్తిగా తొలగించుకోవచ్చు అని సూచించారు.

ప్రమాదం గురించి ముందుగానే సమాచారం వస్తే, దాన్ని వెంటనే ఎదుర్కోవాలని తాను నమ్ముతానని, ఇది దేశం విషయంలోనైనా, వ్యక్తిగతంగా అయినా తనది ఇదే విధానం అని చెప్పారు. అందుకే తాను రెండో మార్గాన్ని ఎందుకున్నారని, టార్గెటెడ్ ట్రీట్మెంట్ తీసుకున్నానని, సమస్యను పూర్తిగా తొలగించుకున్నానని వెల్లడించారు. ఇప్పుడు పూర్తిగా క్యాన్సర్ మాయమైందని, దేవుడి దయ వల్ల దీనిని తాను అధిగమించినట్లు చెప్పారు. ఇజ్రాయిల్ ప్రజలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.