NTV Telugu Site icon

Benjamin Netanyahu: కింగ్ బీబీ..కరుడుగట్టిన జాతీయవాది..ఇజ్రాయిల్ ప్రధాని గురించి కీలక విషయాలు..

Benjamin Netanyahu

Benjamin Netanyahu

Benjamin Netanyahu: జెంజిమిన్ నెతన్యాహు-ఇజ్రాయిల్ ఈ రెండు పర్యాయపదాలుగా ఉన్నాయి. ఇజ్రాయిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి కంటే ఏ దేశంలో కూడా మరో వ్యక్తి ఎక్కువ కాలం దేశాన్ని పాలించడం చాలా అరుదు. ఆ అరుదైన వ్యక్తుల జాబితాలోకి వస్తారు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. ఇజ్రాయిల్ లో అతి పిన్న, అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా నెతన్యాహుకు పేరుంది. 1988లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కేవలం 8 ఏళ్లలోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

కరుడుగట్టిన జాతీయవాదిగా, కింగ్ బీబీగా పిలుచుకునే నెతన్యాహూ 1996లో అధికారంలోకి వచ్చినప్పుడు, పాలస్తీనాతో ఎప్పుడూ శాంతి ఒప్పందానికి అవకాశం ఇవ్వలేదనే విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి.

సైనికుడి నుంచి ప్రధానిగా..

1949లో టెల్ అవీవ్ లో జన్మించిన నెతన్యాహు కుటుంబం 60వ దశకం ప్రారంభంలో కొన్నేళ్ల పాటు అమెరికా వెళ్లారు. 18 ఏళ్ల వయసులో 1967లో నెతన్యాహూ ఇజ్రాయిల్ తిరిగి వచ్చి సైన్యంలో చేరాడు. ఇజ్రాయిల్ పటిష్టమైన కమాండో యూనిటైన సయెరెట్ మత్కల్ వంటి వాటికి కెప్టెన్‌గా పనిచేశారు. సైన్యం నుంచి బయటకు వచ్చిన నెతన్యాహూ 1972-76 మధ్య చదువుకునేందుకు మళ్లీ అమెరికా వెళ్లారు.

బెంజిమెన్ నెతన్యాహూ సోదరుడు యోనాతన్ నెతన్యాహూ ఇజ్రాయిల్ సైనిక హీరోల్లో ఒకరు. బందీగా ఉన్న యూదులను విడిపించే ‘ఆపరేషన్ ఎంటెబ్బే’ సమయంలో మరణించాడు. ఈ ఆపరేషన్ లో 100 మందికి పైగా యూదుల్ని రక్షించారు. 1978లో తన సోదరుడి జ్ఞాపకార్థం ది జోనాథన్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించారు. అతను 1994 నుండి 1998 వరకు UNలో ఇజ్రాయెల్ యొక్క శాశ్వత ప్రతినిధిగా ఉన్నాడు. ఆ సమయంలో మంచి పేరు సంపాదించుకున్నాడు.

1988లో రాజకీయ అరంగ్రేటం చేసిన నెతన్యాహూ రైట్ వింగ్ లికుడ్ పార్టీ తరుపున పోరాడి గెలిచారు. డిఫ్యూటీ ఫారిన్ మినిస్టర్ గా సేవలు చేశారు. ఆ తరువాత 1993లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. పాలస్తీనాతో శాంతి ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అప్పటి ప్రధాని యిట్జాక్ రాబిన్ 1995లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఒక ఏడాదికే నేరుగా ఎన్నికైన ఇజ్రాయిల్ ప్రధానిగా నిలిచారు.

అవినీతి మచ్చ.. హమాస్ దాడులు.

బెంజిమెన్ నెతన్యాహూ 6 సార్లు, 16 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అయితే గతవారం జరిగిన హమాస్ దాడులు, ఈ దాడుల్లో 1200 మంది ఇజ్రాయిలీలు మరణించడం జెంజిమెన్ నెతన్యాహుకు కళంకంగా మారాయి. దేశాన్ని రక్షించలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు లంచం ఆరోపణలు, న్యాయసవరణలపై ఇటీవల ఇజ్రాయిల్ అట్టుడికింది. నెతన్యాహుపై ప్రజలు నిరసన తెలిపారు. ఇది జరిగిన కొన్ని నెలల్లోనే తాజాగా హమాస్ అటాక్ జరిగింది.

ఐసిస్ తరహాలోనే హమాస్ ని తొక్కెస్తామని నెతన్యాహూ హెచ్చరించాడు. 24 గంటల్లో గాజాను ఖాళీ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం సాగుతున్న యుద్ధాన్ని దగ్గరుండి పర్యవేక్షించడమే కాకుండా, ప్రపంచదేశాల నేతలతో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు.

Show comments