Ireland: ఐర్లాండ్‌లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
- ఐర్లాండ్‌లో అల్లర్లు
- తగలబడ్డ కార్లు, భవనాలు
- వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో హింసతో అట్టుడికింది. ముసుగులు ధరించిన ఆందోళనకారులు చెలరేగిపోయారు కార్లు, నివాసాలను టార్గెట్‌గా చేసుకుని తగలబెట్టారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు దగ్ధం కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వలసదారులను లక్ష్యంగా చేసుకుని ఈ అల్లర్లు చెలరేగాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు.

Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ఈ ఘటనలకు సూడాన్ దేశస్థుడే కారణంగా తెలుస్తోంది. కత్తితో వీరంగం సృష్టించాడు. ఒక వ్యక్తిని కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దీంతో ముసుగు ధరించిన వ్యక్తులు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. కార్లు, ఇళ్లు తగలబెట్టారు. ఇక కత్తిపోటు కేసులో సూడాన్‌కు చెందిన 30 ఏళ్ల హాది అలోడిడ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసులో అతడిని కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్‌కు తరలించింది. ఈ దాడిలో బాధితుడు ఒక కన్ను కోల్పోయినట్లు, ముఖం, వెన్నుపైన తీవ్ర గాయాలు అయినట్లు కోర్టులో వెల్లడైంది.
వైరల్ వీడియోతో ఉద్రిక్తతలు
కత్తిపోటు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెల్ఫాస్ట్లో ఉద్రిక్తతలు పెరిగాయి. సోషల్ మీడియా వేదికగా హింసాత్మక నిరసనలకు పిలుపులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చిన గుంపులు పలు ప్రాంతాల్లో పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలు, బస్సులకు నిప్పంటించారు. కొన్ని కుటుంబాలు తమ ఇళ్లలో చిక్కుకుపోగా, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని వారిని సురక్షితంగా బయటకు తరలించారు. అనేక కార్లు పూర్తిగా కాలిపోయాయి. స్థానిక రాజకీయ నాయకులు, మతపెద్దల ప్రకారం దాడులకు గురైన వారిలో ఎక్కువ మంది నల్లజాతీయులు, వలసదారులే ఉన్నట్లు తెలుస్తోంది.
కీర్ స్టార్మర్ ఖండన
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా స్పందిస్తూ. “ప్రజలను వారి జాతి, నేపథ్యం కారణంగా లక్ష్యంగా చేసుకోవడం అస్సలు సహించం. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఇటీవల బ్రిటన్‌లో వలసదారుల అంశంపై వివాదాలు పెరుగుతున్నాయి. ఆశ్రయం విధానాల కారణంగా ప్రమాదకర వ్యక్తులు దేశంలోకి ప్రవేశిస్తున్నారంటూ కొన్ని ప్రజాహిత, జాతీయవాద పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ఇటీవల జరిగిన మరో హత్యా ఘటన, జాతి వివక్ష ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో బెల్ఫాస్ట్లో చోటుచేసుకున్న తాజా హింసాకాండ బ్రిటన్‌లో వలసదారుల భద్రత, సామాజిక ఐక్యతపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.

తాజావార్తలు
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!