NTV Telugu Site icon

UK: లండన్‌లో దారుణం.. భార్య, ఇద్దరు కుమార్తెలను చంపిన మీడియా ప్రతినిధి

Hewe

Hewe

లండన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు బీబీసీ రేడియో వ్యాఖ్యాతగా గుర్తించారు. ఇంట్లో క్రాస్‌బౌ ఉపయోగించి చంపినట్లుగా తెలుస్తోంది. క్రాస్‌బౌని కలిగి ఉండటానికి లైసెన్స్ అవసరం లేదు. కానీ సహేతుకమైన కారణంగా లేకుండా పబ్లిక్‌గా దానిని తీసుకెళ్లడం చట్టవిరుద్ధం.

ఇది కూడా చదవండి: By-elections: ముగిసిన అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్..పలు చోట్ల ఘర్షణలు

ఉత్తర లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌కు చెందిన కైల్ క్లిఫోర్డ్( 26) మంగళవారం రాత్రి లండన్‌కు ఉత్తరాన ఉన్న బుషే పట్టణంలో భార్య, కుమార్తెలను హతమార్చాడు. చీఫ్ సూపరింటెండెంట్ జోన్ సింప్సన్ మాట్లాడుతూ సాయుధ అధికారులు, స్పెషలిస్ట్ సెర్చ్ టీమ్‌లు మాన్‌హంట్‌లో పాల్గొన్నాయని, అనుమానితుడు ఉత్తర లండన్‌లో లేదా బుషే చుట్టుపక్కల ఉన్నాడని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Group-2: గ్రూప్‌ -2 పోస్టులను పెంచి డిసెంబర్‌లో నిర్వహించాలి.. ప్రభుత్వానికి అభ్యర్థుల విజ్ఞప్తి

బీబీసీ రేడియో వ్యాఖ్యాత.. హంతకుడిగా మారడంపై సంస్థ విచారం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యుల్ని చంపడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితులు స్నేహపూర్వక కుటుంబమని పొరుగు విలేకరులతో అన్నారు.

ఇది కూడా చదవండి:Delhi metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో కొట్లాట.. వీడియో వైరల్

Show comments