NTV Telugu Site icon

Bashar al-Assad: రష్యాలోని సిరియా మాజీ అధ్యక్షుడికి షాక్.. విడాకులు కోరిన భార్య!

Syria

Syria

Bashar al-Assad: సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ దేశాన్ని వీడి రష్యాలో ఉంటున్నారు. ఈ తరుణంలో అసద్‌ వ్యక్తిగత జీవితం గురించి ఓ విషయం బయటకు వచ్చింది. అసద్‌ నుంచి ఆయన భార్య విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో న్యూస్ ప్రచారం చేశారు. అసద్ భార్య పేరు అస్మా.. 2000 సంవత్సరంలో అసద్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఆ దేశ మొదటి మహిళగా ఆమె కొనసాగారు.

Read Also: NagaVamsi : టికెట్ ధరలపై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు

కాగా, ఇటీవల అధికారం కోల్పోయిన అసద్‌ కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారు. ఈ తరుణంలో అస్మా భర్త నుంచి విడాకులు కోరుతూ రష్యా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అలాగే, తిరిగి లండన్‌కు వెళ్లిపోయేందుకు ప్రత్యేక పర్మిషన్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె అభ్యర్థనను రష్యా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మాస్కోలో ఆశ్రయం పొందడం ఇష్టం లేక అస్మా ఈ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Show comments