Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..

  • సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరణశిక్ష..
  • అంతర్యుద్ధ సమయంలో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు..
Bashar Al Assad

Bashar Al Assad

Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. సిరియాలో 14 ఏళ్ల పాటతు కొనసాగిన అంతర్యుద్ధ సమయంలో అసద్ సర్కార్ యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో ఆయనను సిరియా కోర్టు దోషిగా తేల్చింది. ఈ అంతర్యుద్ధంలో సుమారు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అసద్ తమ్ముడు మాజీ సిరియా సైనిక అధికారి మహెర్ అల్ అసద్‌కు కూడా ఇదే కేసులో మరణశిక్ష విధించారు.

అసద్ మేనమామ కుమారుడు అలీఫ్ నజీబ్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది. 2011లో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా అధిపతిగా ఉన్న నజీబ్, అక్కడ క్రూరమైన అణచివేత చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అణచివేత తర్వాత సిరియాలో తిరుగుబాటు, అంతర్యుద్ధం చెలరేగాయి.

ఇదిలా ఉంటే, 2024 డిసెంబర్‌లో ఇస్లామిస్ట్ నేతృత్వంలోని బలగాలు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. డమాస్కస్‌ను చుట్టుముట్టడంతో అసద్ తన కుటుంబ సభ్యులతో సిరియా నుంచి రష్యాకు పారిపోయారు. అతీఫ్ నజీబ్‌ను ఆ తర్వాత అరెస్ట్ చేశారు. మాజీ ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొంటున్న అత్యున్నత స్థాయి అధికారుల్లో ఇతను ఒకరు. అసద్ ప్రవాసంలో ఉన్న సమయంలోనే అతడికి కోర్టు మరణశిక్ష విధించింది.