NTV Telugu Site icon

Obama: విడిపోతున్న ఒబామా దంపతులు..! విడాకులకు అఫ్లై చేసుకున్నట్లు వార్తలు!

Michelleobama

Michelleobama

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇద్దరూ కూడా గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ అంటూ ఉదహరిస్తు్న్నారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఒబామా ఒక్కరే పాల్గొంటారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇటీవల మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు ఒబామా ఒక్కరే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడైన్ దంపతులు.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఫ్యామిలీ సహా.. మాజీ అధ్యక్షుల దంపతులంతా హాజరయ్యారు. కానీ ఒబామా ఒక్కరే సింగిల్‌గా పాల్గొన్నారు. దీంతో ఒబామా దంపతులు విడిపోతున్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు అందరూ హాజరైతే.. మిచెల్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.

ఇది కూాడా చదవండి: Saif Ali Khan: సైఫ్ మొదటి భార్య ఎవరు, విడాకుల తర్వాత అతను ఎన్ని కోట్లు చెల్లించాడో తెలుసా??

బరాక్ ఒబామా రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలో అమెరికా ప్రథమ పౌరురాలిగా మిచెల్ చాలా ఉత్సాహంగా ఉండేవారు. ఎక్కడికెళ్లినా ఒబామాతోనే మిచెల్ ఉండేవారు. చాలా అన్యోన్యంగా మెలిగే వారు. మోస్ట్‌ పాపులర్‌ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది వారిద్దరూ విడిపోతున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. 2000 సంవత్సరంలోనే మిచెల్‌.. బరాక్‌ ఒబామాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నట్లు 2012లో విడుదలైన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. తమ వైవాహిక బంధంలో చిన్న చిన్న మనస్పర్థలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించేందుకు కౌన్సెలింగ్‌ తీసుకున్నట్లు మిచెల్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా ఆ వ్యాఖ్యలు నిజమవుతున్నట్లు కనిపిస్తు్న్నాయి. 1992లో వివాహ బంధంతో ఒక్కటైన ఒబామా దంపతులకు సాషా, మలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఒబామా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఏకధాటిగా రెండు పర్యాయాలు అమెరికాను పాలించారు.

 

Show comments