Site icon NTV Telugu

Obama: ఈ ఏడాది ఒబామాను మెప్పించిన సినిమాలు ఇవే!

Obama7

Obama7

ఒరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. వరుసగా రెండు సార్లు అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఇంట్లో శేష జీవితాన్ని గడుపుతున్నారు. సినిమాలు, పుస్తకాలు, టీవీ చూస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగుస్తోంది. అయితే ప్రతి ఏడాది తనకిష్టమైన సినిమాలు, పుస్తకాల వివరాలను ఒబామా తెలియజేస్తుంటారు. వైట్‌హౌస్‌లో ఉన్న దగ్గర నుంచి ఈ అలవాటును కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా ఏఏ సినిమాలు ఇష్టమో.. ఏఏ పుస్తకాలు చదివారో సోషల్ మీడియాలో పంచుకున్నారు.

2025లో చూసిన సినిమాల్లో ఏఏ మూవీస్ ఇష్టమో ఒబామా తెలియజేశారు. సిన్నర్స్, నో అదర్ ఛాయిస్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వంటి చిత్రాల తనను మెప్పించాయని పేర్కొన్నారు. ఇక సంగీతంలో లేడీ గాగా, బ్లాక్‌పింక్ సింగర్స్ తనను ఆకట్టుకున్నాయని వెల్లడించారు. సిన్నర్స్ అమెరికన్ చిత్రం కాగా.. నో అదర్ ఛాయిస్ కొరియన్ సినిమా. ఇక లేడీ గాగా రాసిన అబ్రకాడబ్రా పాటలు నచ్చాయన్నారు. ఇక బ్లాక్‌పింక్ రాసిన జంప్, సెక్సో, రోసాలియా రాసిన వయోలెన్సియా వై లాంటాస్ నచ్చినట్లు తెలిపారు.

ఇక ఒబామా భార్య మిచెల్ ఒబామా రాసిన పుస్తకం ‘ది లుక్’ పట్ల పక్షపాతం చూపించారు. ఆమె రాసిన పుస్తకం గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

ఇక అనేక క్లాసిక్‌లు ఇష్టమైనట్లుగా చెప్పారు. వాటిలో పిల్లలు సూచించిన ఇండీ డార్లింగ్ జే సోమ్, జిమ్ అడ్కిన్స్ రాసిన ఫ్లోట్, మెటల్ బై ది బెత్స్, ఖమారి రాసిన సైకామోర్ ట్రీ, లిల్ నాయ్, మైక్ టవర్స్ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఒబామా ఒక విజ్ఞప్తి చేశారు. ఇంకా చూడాల్సిన సినిమాలు గానీ.. పుస్తకాలు ఉంటే సూచించాలని కోరారు.

 

Exit mobile version