Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్ సింగర్ కచేరీపై మతోన్మాద గుంపు దాడి..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే, ఇద్దరు హిందువుల్ని అత్యంత దారుణంగా హత్యలు చేశారు. బంగ్లాదేశ్ కళాకారులు, సాంస్కృతిక చిహ్నాలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, ఢాకాకు 120 కి.మీ దూరంలో ఉన్న ఫరీద్‌పూర్‌లో బంగ్లా ఫేమస్ సింగర్ జేమ్స్ కచేరీపై దాడికి పాల్పడ్డారు. ఒక స్థానిక పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు కచేరీ జరగాల్సి ఉంది. అయితే, కొంత మంది ఈ కార్యక్రమంలోకి ప్రవేశించి, వేదికపైకి ఇటుకలు, రాళ్లు విసిరారు. చివరకు స్థానిక అధికారుల ఆదేశాల మేరకు కచేరిని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో 25 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

Read Also: Pushpa 2 Stampede: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు.. ఛార్జిషీట్‌ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్!

బంగ్లా రాక్‌స్టార్ జేమ్స్‌ కన్సర్ట్‌పై దాడికి పాల్పడినట్లు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈ సంఘటనను హైలెట్ చేశారు. ప్రదర్శన ఇవ్వకుండా జేమ్స్‌ను ఈ జిహాదీలు అడ్డుకున్నారని ఆమె అన్నారు. ఇటీవల కాలంలో రాడికల్ శక్తులు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న కళాకారులు, సాంస్కృతిక సంస్థలు, జర్నలిస్టులు, వార్తాపత్రికా కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. మహ్మద్ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, పరోక్షంగా మద్దతు ఇస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లబోతున్న బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అశాంతి రాజ్యమేలుతోంది.

Exit mobile version