Site icon NTV Telugu

Bangladesh: పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలని కోరిన బంగ్లాదేశ్.. మళ్లీ మొదటికొచ్చిన పంచాయతీ..?

Banfladesh

Banfladesh

Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇరు దేశాలకు చెందిన విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 1971 నాటి అఘాయిత్యాలపై పాక్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఢాకా డిమాండ్ చేసింది. అలాగే, పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారినప్పుడు ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో తమ వాటాగా రావాల్సిన 4.3 బిలియన్ డాలర్లు చెల్లించాలన్నారు. అయితే, ఢాకాలోని స్టేట్ గెస్ట్ హౌస్ పద్మలో జరిగిన ఈ చర్చల్లో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీం ఉద్దీన్, పాక్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ పాల్గొన్నారు. ఇక, ఈ నెల 27, 28 తేదీల్లో బంగ్లాదేశ్ పర్యటనకు పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ వెళ్లడానికి ముందు చర్చలు జరగడం గమనార్హం.

Read Also: TG EAPCET 2025: విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 29 నుంచే ఈఏపీసెట్ పరీక్షలు

ఇక, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీం ఉద్దీన్ మాట్లాడుతూ.. 1971 యుద్ధ సమయంలో పాక్ సైన్యం చేసిన ఊచకోతకు పాల్పడినందుకు బహిరంగ క్షమాపణతో పాటు బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న పాకిస్తానీయుల పునరుద్ధరణ, పాక్‌లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆస్తుల పంపకం, 1970 తుఫాన్ బాధితులకు ఇచ్చిన విదేశీ ఆర్థిక సహాయం బదిలీ లాంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ సమస్యలు పరిష్కారమైతే, ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు పునాదిని వేసుకోవచ్చు అన్నారు. అయితే, ఈ విషయంలో పాకిస్థాన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు ఉద్దీన్ పేర్కొన్నారు.

Read Also: Minister Narayana: రేపే ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’.. అధికారులకు మంత్రి దిశా నిర్దేశం

అయితే, గత సంవత్సరం బంగ్లాదేలో షేక్ హసినా సర్కార్ దిగిపోయిన తర్వాత పాకిస్థాన్- బంగ్లాదేశ్ లు తిరిగి సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చర్చలు కొనసాగిస్తుండటం గమనార్హం. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ..1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సంగ్రామంలో ముజిబుర్ రెహ్మాన్ పాత్రను తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నట్లు పలు కథలు వెలువడుతున్నాయి. ఆ యుద్ధంలో బంగ్లాదేశ్‌కు అన్ని రకాలుగా అండగా నిలిచిన భారత సైన్యం.. సుమారు 90 వేల మంది పాక్ సైనికులను బందీలుగా చేసుకుంది.

Exit mobile version