NTV Telugu Site icon

Bangladesh: భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ.. షేక్ హసీనాను తిరిగి పంపించాలని వినతి

Sheikhhasina

Sheikhhasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్‌ హసీనా ప్రధాని పీఠం నుంచి తప్పుకున్నారు. అనంతరం దేశాన్ని వదిలిపెట్టి భారత్‌కు వచ్చేశారు. ఆగస్టు 5 నుంచి భారత్‌లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్‌ యూనస్‌ నేృత్వంలోని బంగ్లాదేశ్‌ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది.

ఇది కూడా చదవండి: Vinod Kambli: మళ్లీ క్షీణించిన మాజీ క్రికెటర్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స

షేక్‌ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్‌ మంత్రులు, సలహాదారులుపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా షేక్‌ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాకు తెలిపారు. భారత్‌తో దౌత్యపరమైన కమ్యూనికేషన్ జరుగుతోందని వెల్లడించారు.

హసీనాను అప్పగించేందుకు వీలుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని హోం సలహాదారు జహంగీర్ ఆలం తెలిపారు. ఆమెను అప్పగించేందుకు సంబంధించి విదేశాంగ శాఖకు లేఖ పంపామని, ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని ఆయన మీడియాకు తెలిపారు. ఢాకా మరియు న్యూఢిల్లీ మధ్య హసీనా అప్పగింత ఒప్పందం ఉందని ఆ ఏర్పాటు ప్రకారం బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకెళ్లవచ్చని ఆలం చెప్పారు.

ఇది కూడా చదవండి: Delhi: విద్యార్థులకు షాక్.. నో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం

Show comments