Site icon NTV Telugu

Bangladesh protests: ప్రధాని అధికారిక నివాసంలో వస్తువులు లూటీ.. ఫర్నీచర్, చికెన్ అపహరణ

Sheikh Hasinasofa

Sheikh Hasinasofa

ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాపై ఆందోళనకారుల నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. సోమవారం ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పరారయ్యారు. దీంతో నిరసనకారులు ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. విలువైన వస్తువుల్ని లూటీ చేసిన దృశ్యాల్లో మీడియాలో కనిపించాయి. చికెన్‌, ఫిష్, కూరగాయలు, ఫర్నీచర్‌, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిపోయినట్లు వెల్లడించాయి. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన షేక్ హసీనా నిష్క్రమించడంతో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. జెండాలు ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఢాకాలో పార్క్‌ చేసిన యుద్ధ ట్యాంక్‌పైకి ఎక్కి డ్యాన్సులు చేశారు.

ఇది కూడా చదవండి: Devara Chuttamalle song: దేవర చుట్టమల్లే సాంగ్ తెలుగు లిరిక్స్ మీకోసం!

ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్‌ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2018లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యార్థులు నిరసన తెలియజేయటంతో వెనక్కి తగ్గింది. జూన్‌లో బంగ్లాదేశ్ హైకోర్టులో కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడటంతో మళ్లీ ఆందోళనలు ఉధృతం అయ్యాయి. మధ్యలో సద్దుమణిగిన నిరసనలు ఆదివారం ఒక్కసారిగా చెలరేగాయి. ఇప్పటివరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Taj Mahal: మరోసారి భద్రత విఫలం.. తాజ్ మహల్లోకి గంగాజలంతో వచ్చిన మహిళ

ఆదివారం సాయంత్రం నుంచి 6 గంటల నుంచి బంగ్లాదేశ్‌ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రాం సేవలనూ నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ను ఆపేయాలంటూ మొబైల్‌ ఆపరేటర్లను ఆదేశించారు. ప్రజా భద్రతను పరిగణనలోకి తీసుకుని సోమవారం నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా.. కర్ప్యూను అధిగమించి నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. మొత్తానికి నిరసనకారుల డిమాండ్‌కు తలగ్గొడంతో షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు.

https://twitter.com/oishee_jg/status/1820413427464175906

Exit mobile version