Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
- భారత్ పర్యటనకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్!
- ల్లుండి భారత్‌లో పర్యటన!
- జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ ఎట్టకేలకు భారత్ పర్యటనకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగిస్తేనే గానీ.. తారిఖ్ రెహమాన్ భారత్‌లో పర్యటించరని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే భారత్ నుంచి సానుకూల వాతావరణం ఉండడంతో శాంతించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనకు వస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఆగస్టు 23 నుంచి 25 వరకు భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తారిఖ్ రెహమాన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కానుంది. ఫిబ్రవరిలో ఆయన బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
షేక్ హసీనా అప్పగింత వివాదం
తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటన నేపథ్యంలో షేక్ హసీనా అప్పగింత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్.. హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను సంబంధిత చట్టాలు, న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.
Also Read
- Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
- Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
తొలి పర్యటన..
ఫిబ్రవరిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తారిఖ్ రెహమాన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా షేక్ హసీనా అప్పగింతతో పాటు భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న పలు అంశాలపై ఇరు దేశాల నేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రెహమాన్ భారత్ పర్యటనపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఆగస్టు 23 నుంచి 25 వరకు ఆయన పర్యటించే అవకాశం ఉందన్న సమాచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!