Site icon NTV Telugu

Sheikh Hasina: ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఎక్కడికి వెళ్ళిపోయారు..?

Hasina

Hasina

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్ర ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో.. ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి దేశం వదిలి పెట్టి పారిపోయారు. అయితే, ఆమె ఎక్కడికి వెళ్లారన్న దానిపై ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ రాలేదు. ప్రత్యేక మిలిటరీ విమానంలో హ‌సీనాతో పాటు ఆమె సోద‌రి షేక్ రెహానా భారత్ వైపుకు ప‌య‌న‌మైన‌ట్లు కొన్ని వార్త సంస్థలు వెల్లడించాయి.

Read Also: CM Chandrababu: పోర్టుల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కాగా, ప‌శ్చిమ బెంగాల్ దిశ‌గా బంగ్లా ప్రధాన మంత్రి షేక్ హసీనా వెళ్లిన‌ట్లు ఢాకా ట్రిబ్యూన్ త‌న రిపోర్టులో వెల్లడించింది. కానీ, బంగ్లాదేశ్ బీబీసీ మాత్రం ఆమె అగర్తలా వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. బంగ‌భ‌బ‌న్ నుంచి హసీన మ‌ధ్యాహ్నం 2.30 గంటలకు స్టార్ట్ చేయినట్లు పేర్కొన్నారు. షేక్ హ‌సీనా, షేక్ రెహానాలు సుర‌క్షిత‌మైన ప్రాంతానికి చేరినట్లు ఓ వార్తా సంస్థ ప్రకటించింది. అధ్యక్ష భ‌వ‌నం విడిచి వెళ్లిపోవడానికి ముందు.. షేక్ హ‌సీనా స్పీచ్‌ను రికార్డు చేయాలని అనుకున్నారు.

Read Also: Road Accident: మద్యం మత్తులో బైక్‌ ను గుద్దేసిన ఎస్‌యూవీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..

కానీ, ఆ స‌మ‌యం ఎవరు లేక‌పోవ‌డంతో షేక్ హసీనా తొంద‌ర‌గా గానభవన్‌ను నుంచి పారిపొయినట్లు చెప్తున్నారు. 1971 యుద్ధంలో మ‌ర‌ణించిన సైనిక కుటుంబాల పిల్లలకు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హ‌సీనా స‌ర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఆదివారం జ‌రిగిన హింస‌లో సుమారు వంద మందికి పైగా మ‌ర‌ణించారు.

Exit mobile version