Bangladesh PM Resign: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్ లో పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ఆర్మీ చీఫ్ ప్రకటించారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా సంస్థల ద్వారా కథనాలు వెల్లడించారు. రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘర్షణలతో ఆ దేశం ఒక్కసారిగా అట్టుడుకిపోతుంది. ప్రధాన మంత్రి హసీనా రాజీనామా డిమాండ్ చేయాలని నిరసనకారులు రోడ్డెక్కారు. క్రమక్రమంగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో.. ఆదివారం ఒక్కరోజే దాదాపు వంద మంది వరకు మరణించినట్లు సమాచారం. ఆందోళనలు తీవ్ర ఉధృతం కావడంతో రాజీనామా చేయాలని పీఎం షేక్ హసీనా అనుకున్నారు..
Read Also: Anchor Suma: స్టేజ్ మీద సుమ చేతిని ముద్దాడిన నటుడు.. షాకింగ్ కామెంట్స్
అయితే, ఆర్మీ అధికారుల సూచనలతో ప్రధాన మంత్రి షేక్ హసీనా కనీసం రాజీనామా రికార్డింగ్ కూడా చేయకుండా ఆమె సోదరితో కలిసి ప్రధాని భవనం గానభవన్‌ను వీడిచిపెట్టినట్లు తెలుస్తుంది. దేశ రాజధాని ఢాకా వీధుల్లో భారీగా బంగ్లా సైన్యం మోహరించింది. మరోవైపు, బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఇప్పటిదాకా జరిగిన నిరసనల్లో వందల మంది (అధికారిక సమాచారం ప్రకారం 300 మందికి పైగా) మరణించినట్లు వెల్లడించారు. కాగా, ఆమె ఆశ్రయం కోసం భారతదేశానికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరోవైపు, హసీనా ఢాకా విడిచిపెట్టారనే విషయం తెలిసిన వెంటనే వేల మంది నిరసనకారులు ప్రధాన మంత్రి నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకు దిగారు.