Site icon NTV Telugu

Bangladesh: రేపే బంగ్లాదేశ్ ఎన్నికలు, ఫలితాలు.. సర్వత్రా ఆసక్తి

Bangladesh1

Bangladesh1

బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత తొలిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఒక యువ రాజకీయ నాయకుడు హత్య తర్వాత కూడా భారీ స్థాయిలో ఘర్షణలో జరిగాయి. ఇక ఈ మధ్య అయితే హిందువులే టార్గెట్‌గా మారణహోమం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గురువారం (12-02-2026) బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.

గురువారం ఉదయం 7:30 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. 300 స్థానాలకు గాను 299 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌తో పాటు బంగ్లాదేశ్ రాజ్యాంగం సవరణకు సంబంధించిన జాతీయ చార్టర్‌పై కూడా ప్రజలు ఓటు వేయనున్నారు.

ఇక బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ప్రకారం.. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4:30 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పేపర్ బ్యాలెట్‌లతో మాత్రమే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రేపు రాత్రికి లేదా అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వచ్చేయనున్నాయి. హింస, ఉద్రికత్తల నేపథ్యంలో పోలింగ్ కోసం 1 మిలియన్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 5 లక్షల మందితో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక అనేక దేశాల నుంచి వచ్చిన 350 మంది విదేశీ పరిశీలకులు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.

Exit mobile version