Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Bangladesh Army Chief Warns Mohammad Yunus Differences Over Rakhine Corridor

Bangladesh: మహ్మద్ యూనస్‌కి ఆర్మీ చీఫ్ వార్నింగ్.. “రఖైన్ కారిడార్‌”పై విభేదాలు..

Published Date :May 22, 2025 , 7:00 pm
By Venu Goapl Reddy
  • మరోసారి యూనస్‌కి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వార్నింగ్..
  • రఖైన్ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’గా పిలిచిన ఆర్మీ చీఫ్..
  • వకార్ ఉజ్ జమాన్ హెచ్చరికతో యూనస్ ప్రభుత్వం యూటర్న్..
Bangladesh: మహ్మద్ యూనస్‌కి ఆర్మీ చీఫ్ వార్నింగ్.. “రఖైన్ కారిడార్‌”పై విభేదాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మరోసారి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే, అక్కడి యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి పడటం లేదు. ఆర్మీ చీఫ్ హెచ్చరికల తర్వాత యూనస్ ప్రభుత్వం మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి ‘‘మానవతా కారిడార్’’ని తిరస్కరించింది. బంగ్లాదేశ్ ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’గా పిలిచారు. విదేశాంగ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఏకపక్షంగా ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిత రఖైన్ కారిడార్ అంగీకరించిందని ప్రకటించారు. దీనిపై ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు చేయడంతో, ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది.

ఈ కారిడార్ బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుందని, ఇది భౌగోళిక వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా దీనిని ముందుకు తెస్తోందని బంగ్లాదేశ్‌కి ఆందోళన ఉంది. ఎన్నికలు లేకుండా అధికారంలో ఉండటానికి యూనస్, ఆయన మద్దతు దాడులు అమెరికా డిమాండ్లకు తలొగ్గుతున్నారని బంగ్లాదేశ్ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కారిడార్‌పై ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మాట్లాడుతూ..‘‘ బంగ్లాదేశ్ సైన్యం సార్వభౌమత్వానికి హాని కలిగించే ఏ కార్యకలాపాల్లో పాల్గొనదు. అలా చేయడానికి ఎవరిని అనుమతించదు’’ అని హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: Trump: ‘‘ట్రంప్ ప్రతీ దానికి క్రెడిట్ తీసుకుంటారు’’.. అది ఆయన లక్షణం..

ఇదే కాకుండా, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, సైనిక విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలని, రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలు సైన్యం అదుపులో ఉండాలని జమాన్ యూనస్‌కి కఠిన స్వరంతో చెప్పారు. తూర్పు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ డివిజన్‌ని మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రాన్ని ఈ కారిడార్ కలుపుతుంది. యుద్ధంతో సతమతమవుతున్న రఖైన్ రాష్ట్రంలోని ప్రజలకు ఈ కారిడార్ ద్వారా మానవతా సాయం అందించాలనేది ప్రధాన ఉద్దేశ్యం. అయితే, దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి తెలపడాన్ని ఖలీదా జియాకు చెందిన బీఎన్పీ, వామపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి.

బర్మా సైన్యం దాడులతో ఆ రాష్ట్రంలోని రోహింగ్యాలు బంగ్లాదేశ్ కి వస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్‌లోని కాక్స్ బజార్ ఏకంగా 1.3 మిలియన్ల రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తోంది. ఈ పరిస్థితితో ఆయుధాల అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు పెరిగాయి. ఇది బంగ్లాదేశ్ భద్రతకే ప్రమాదంగా మారింది. అయితే, ఇప్పటి ప్రతిపాది కారిడార్ అమెరికా వ్యూహంగా, చైనాకు చెక్ పెట్టేందుకు తీసుకువస్తున్నారని, ఇది బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ప్రమాదంగా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Bangladesh Army Chief
  • Bangladesh Army chief Waker-Uz-Zaman
  • Muhammad Yunus
  • Myanmar

తాజావార్తలు

  • Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

  • Carmeni Selvam: అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే ‘కార్మేని సెల్వం’

  • Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు పెట్టిన కొత్త కోడలు.. నగదు, నగలతో పరార్

  • Spoiled Meat: హైదరాబాద్‌లోని హోటల్స్‌లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా..? బాబోయ్..

  • Drug Test Proposal: హీరో హీరోయిన్లు డ్రగ్ టెస్టులు.. రాజకీయ నేతలు లై డిటెక్టర్ టెస్టులు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions