Site icon NTV Telugu

Imports Ban: ఆ వస్తువుల దిగుమతులపై బ్యాన్‌.. అసలు కారణం ఇదే

Imports Ban

Imports Ban

Imports Ban: కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే (ఆగస్టు 3వ తేదీ నుంచే) అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా.. స్థానిక తయారీని ప్రోత్సాహించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది ఒకటి. ఒకవేళ.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ తదితర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెక్ట్స్‌ని దిగుమతి చేసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Read also: Air India Express: విమానాన్ని వెనక్కి రప్పించిన ఉల్లి ఘాటు..

కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వం చాలా రంగాల్లో దేశీయ తయారీని ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద.. వివిధ రంగాల్లో స్థానికంగా తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్న వారికి కేంద్రం భారీఎత్తున ప్రోత్సాహకాల్ని అందిస్తోంది. అయినప్పటికీ.. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి చౌకగా దిగుమతులు జరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంప్యూటర్స్, ల్యాప్‌టాబ్స్, ట్యాబ్లెట్ల దిగుమతులు 6.3 శాతం పెరిగి.. 19.9 బిలియన్ డాలర్లకు (ఇండియన్ కరెన్సీలో రూ.1.6 లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఫలితంగా.. దేశీయ తయారీపై గట్టి ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. దేశీయ తయారీని ప్రోత్సాహించడంలో భాగంగా ఆ మూడింటిపై కేంద్రం ఆంక్షలు విధించింది.

Read also: Sajjala Ramakrishna Reddy: ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు బ్రేక్‌లు.. సర్కార్‌ కీలక నిర్ణయం

భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ సెక్టర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ ఆంక్షల కారణంగా, ఆ మూడు పరికరాల దిగుమతికి సంబంధించిన ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు బావిస్తున్నారు. అంతేకాదు.. ఈ నిర్ణయం డెల్, ఏసర్, సామ్‌సంగ్, పానసొనిక్, యాపిల్, లెనోవో, హెచ్‌పీ వంటి సంస్థలకు పెద్ద సవాలుగా మారనుంది. ఈ సంస్థలన్నీ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. తాజా ఆంక్షల కారణంగా.. ఈ కంపెనీలు ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ యూనిట్లను భారత్‌లోనే నెలకొల్పి, సమర్థవంతంగా పని చేసే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Exit mobile version