Site icon NTV Telugu

Pakistan: బలూచిస్తాన్‌లో ముగిసిన పాక్ ఆట.. బీఎల్ఏ ఆధీనంలో పట్టణాలు, ప్రభుత్వ భవనాలు..

Pak I

Pak I

Pakistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్‌ని చెల్లించబోతోంది. ఇప్పటికే, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా, బలూచ్ ప్రాంతంలోని ఆర్మీని ఎల్ఓసీ, భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో ఆ ప్రావిన్సుల్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ విరుచుకుపడుతోంది. నిజానికి బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాల్లో మాత్రమే పాక్ ప్రభుత్వ అధికారం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో బీఎల్ఏ యోధులదే అధికారం. ఇప్పుడు, ఆ కొద్ది అధికారం కూడా పాక్ చేజారిపోతోంది.

Read Also: Tata vs MG: భారతీయ దిగ్గజ కంపెనీ టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ..?

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం, కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ తన స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలతో ఆధీనంలోకి తీసుకుంది. ఒక భవనానికి నిప్పుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో బీఎల్ఏ యోధులు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్రవారం మొత్తం పాకిస్తాన్‌కి బీఎల్ఏ చుక్కలు చూపించింది.

మరోవైపు ప్రావిన్సు రాజధాని క్వెట్టాను కరాచీని కలిపే హైవేని తిరుగుబాటుదారులు దిగ్బంధించారు. నేషనల్ బ్యాంకులు, కోర్టుల్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిప్పంటించారు. పాకిస్తాన్ దళాలు వచ్చే సమయానికి మొత్తం విధ్వంసం సృష్టించారు. ఇదే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ శిబిరంపై కూడా దాడి చేశారు. పాక్ ఆర్మీకి చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగోచార్‌‌ని బీఎల్ఏ సూసైడ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. కోట్ లాంగోవ్ ప్రాంతంలోని లెవీస్ చెక్‌పోస్టుపైమ కాల్పులు జరిగాయి. దీంట్లో ఒక అధికారి మరణించాడు. కలాత్ జిల్లాలోని రహీమాబాద్‌ ప్రాంతంలో ఒక వంతెన కింద బాంబు పేలింది.

Exit mobile version