Pakistan: బలూచిస్తాన్‌లో ముగిసిన పాక్ ఆట.. బీఎల్ఏ ఆధీనంలో పట్టణాలు, ప్రభుత్వ భవనాలు..
- బలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌కి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..
- వరస దాడులతో విరుచుకుపడుతున్న తిరుగుబాటుదారులు..
- కీలకమైన మంగోచార్ పట్టణం బీఎల్ఏ వశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని చెల్లించబోతోంది. ఇప్పటికే, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా, బలూచ్ ప్రాంతంలోని ఆర్మీని ఎల్ఓసీ, భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో ఆ ప్రావిన్సుల్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ విరుచుకుపడుతోంది. నిజానికి బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాల్లో మాత్రమే పాక్ ప్రభుత్వ అధికారం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో బీఎల్ఏ యోధులదే అధికారం. ఇప్పుడు, ఆ కొద్ది అధికారం కూడా పాక్ చేజారిపోతోంది.
Read Also: Tata vs MG: భారతీయ దిగ్గజ కంపెనీ టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ..?
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం, కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ తన స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలతో ఆధీనంలోకి తీసుకుంది. ఒక భవనానికి నిప్పుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో బీఎల్ఏ యోధులు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్రవారం మొత్తం పాకిస్తాన్‌కి బీఎల్ఏ చుక్కలు చూపించింది.
మరోవైపు ప్రావిన్సు రాజధాని క్వెట్టాను కరాచీని కలిపే హైవేని తిరుగుబాటుదారులు దిగ్బంధించారు. నేషనల్ బ్యాంకులు, కోర్టుల్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిప్పంటించారు. పాకిస్తాన్ దళాలు వచ్చే సమయానికి మొత్తం విధ్వంసం సృష్టించారు. ఇదే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ శిబిరంపై కూడా దాడి చేశారు. పాక్ ఆర్మీకి చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగోచార్ని బీఎల్ఏ సూసైడ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. కోట్ లాంగోవ్ ప్రాంతంలోని లెవీస్ చెక్పోస్టుపైమ కాల్పులు జరిగాయి. దీంట్లో ఒక అధికారి మరణించాడు. కలాత్ జిల్లాలోని రహీమాబాద్ ప్రాంతంలో ఒక వంతెన కింద బాంబు పేలింది.
BIG BREAKING:
Baloch freedom fighters have reportedly taken control of Mangocher city in Kalat district, seizing government buildings and military installations.
Hundreds of armed men are involved, and intense clashes continue after an attack on the main Pakistani Army camp. pic.twitter.com/qCFUJJJCDp
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 2, 2025
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?