అలాస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం జరిగింది. వీరిద్దరి భేటీతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏదొక పరిష్కారం దొరుకుతుందని ప్రపంచమంతా ఎదురుచూస్తే.. చివరికి ఏమీ లేకుండానే 3 గంటల సమావేశం ముగియడం ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్-పుతిన్ భేటీలో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఇరు దేశాలు ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: Putin-Melania Trump: పుతిన్‌కు మెలానియా లేఖ.. ఏముందంటే..!
ఇక సమావేశానికి ముందు అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరానికి ట్రంప్ వచ్చారు. అనంతరం కొద్దిసేపటికి పుతిన్ కూడా చేరుకున్నారు. ట్రంప్ చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా పుతిన్‌కు స్వాగతం పలికారు. చప్పట్లు కొడుతూ.. చిరునవ్వుతో ట్రంప్ స్వాగతం పలికారు. చాలా సేపు షేక్‌హ్యాండ్ ఇచ్చుకుని మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరు పొడియం దగ్గరకు నడుచుకుంటూ వస్తున్న సమయంలో పుతిన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తల పైనుంచి బీ-2 బాంబర్లు వెళ్లాయి. దీంతో పుతిన్‌కు ఒకింత ఆశ్చర్యానికి గురై.. వాటి వైపు చూస్తూ నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అంతేకాకండా ఎయిర్‌పోర్టులో పలు రకాల ఫైటర్ జెట్లు కూడా ప్రయాణించడం విశేషం. అలాగే కాన్వాయ్ వెళ్లే మార్గంలోనూ యుద్ధ విమానాలు వరుసగా పార్క్ చేసి ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్ కావాలనే ఈ ప్రదర్శన చేయించి ఉంటారని భావిస్తున్నారు. ఇక ట్రంప్-పుతిన్ ఒకే వాహనంలో కూర్చుని మాట్లాడుకోవడం విశేషం.
ఇది కూడా చదవండి: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఆడంబరమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..!
2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు చాలా నష్టపోయాయి. దీంతో ట్రంప్-పుతిన్ భేటీతో యుద్ధానికి ఒక ముగింపు లభిస్తుందని భావించారు. చివరికి ఎలాంటి ఒప్పందం జరగకుండా సమావేశం ముగిసింది. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మేలు జరుగుతుందని అంతా భావిస్తే.. చివరికి ‘తుస్’ మనిపించారు. ఇక ఇద్దరి భేటీ తర్వాత పుతిన్ మాట్లాడుతూ.. 2022లో ట్రంప్ అధికారంలో ఉండుంటే.. యుద్ధం జరిగేదే కాదన్నారు. ప్రస్తుతానికి ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధం ముగింపునకు పుతిన్ ఇంకా నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు. ఈసారి మాస్కోలో భేటీ కావాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు.
HAPPENING NOW! https://t.co/5OBEWIttVv pic.twitter.com/s9KIftc3ZW
— Dan Scavino (@Scavino47) August 15, 2025
— Dan Scavino (@Scavino47) August 15, 2025
