Site icon NTV Telugu

అక్కడ లాక్‌డౌన్‌ పొడిగింపు.. వ్యతిరేకంగా ఆందోళనలు

కరోనా కేసులు ఇంకా కొన్ని దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి… కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్‌.. ఇలా కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి.. ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున కేసులు వెలుగు చూస్తున్నాయి.. దీంతో ముందస్తుగా లాక్‌డౌన్‌ను పొడిగించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.. కరోనా కట్టడి కోసం సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. అయితే, లాక్‌డౌన్‌లతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు.. దీంతో.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నారు ప్రజలు.. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి.. మెల్‌బోర్న్‌లో ఆందోళనాకారులు పోలీసులపై దాడికి దిగారు.. వందలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా… ఈ దాడుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.. దీంతో.. సిడ్నీ, విక్టోరియా, మెల్‌బోర్న్‌తో పాటు అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది సర్కార్.

Exit mobile version