USA- Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌తో యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ మాట్లాడినట్లు పేర్కొనింది. మానవ హక్కులను రక్షించడంలో ఇద్దరు నేతలు తమ నిబ్ధతను తెలియజేశారు. కష్టకాలంలో బంగ్లాకు నాయకత్వం వహిస్తున్న యూనస్‌ను అగ్రరాజ్యం భద్రతా సలహాదారు అభినందించారు. బంగ్లాదేశ్ సంపన్నమైన, స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి అమెరికా మద్దుతుగా ఉంటామని సలివన్ హామీ ఇచ్చారు.
Read Also: UnstoppableS4 : అన్ స్టాపబుల్ సంక్రాంతి హీరోలు ప్రోమో సూపర్బ్
అయితే, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా దేశం వదిలి వెళ్లిన తర్వాత బంగ్లాలో హిందువులపై దాడులు జరిగాయి. ముఖ్యంగా ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగింది. ఇక, హిందువులపై దాడులు కొనసాగడంపై భారత్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతతో పాటు ఆ దేశ విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీమ్ ఉద్దీన్‌తో సమావేశం అయ్యారు.