Site icon NTV Telugu

Pakistan: పాక్ లో న్యాయస్థానాల కంటే ఆర్మీపైనే ఎక్కువ నమ్మకం..

Pak

Pak

Pak Army: మరి కొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముంగిట పాకిస్థాన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో అత్యంత నమ్మకమైన సంస్థగా ‘పాకిస్థాన్‌ సైన్యం’ నిలిచింది. ఈ మేరకు ఇప్సోస్‌ పాకిస్థాన్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సైన్యానికి దాదాపు 74 శాతం రేటింగ్‌ లభించింది. ఈ సర్వేలో ప్రస్తావించిన ఎనిమిదింటిలో ఆశ్చర్యకరంగా ఎన్నికల సంఘం చివరి స్థానంలో నిలిచింది. అయితే, సర్వేలో భాగంగా 18- 34 ఏళ్ల మధ్య వయసున్న 2,050 మందిని ప్రశ్నించినట్లు ద న్యూస్‌ ఇంటర్నేషనల్‌ దినపత్రిక పేర్కొనింది. ఆర్మీ తర్వాత 58 శాతం ఆమోదంతో పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు సెకండ్ ప్లేన్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మూడో స్థానాన్ని పాక్ మీడియా దక్కించుకుందని తెలిపింది. ఇక, ఈ నెల ఎనిమిదో తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారా? అన్న ప్రశ్నకు 70 శాతం మంది అవునని ఆన్సర్ ఇచ్చారు.

Read Also: MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు..

ఇక, గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇస్లామాబాద్‌లోని మహిళల్లో ఈ భావన ఎక్కువగా కనిపిస్తుంది. టీవీ, సోషల్ మీడియా పాకిస్తానీ యువతకు అత్యంత ఇష్టమైన వనరులుగా పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం.. పురుషుల కంటే మహిళా జనాభా టీవీని ఎక్కువగా ఇష్టపడుతుంది.. అయితే పురుషులు వార్తల కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు అని ఈ సర్వేలో వెల్లడైంది.

Exit mobile version