Site icon NTV Telugu

US: ట్రంప్ సమక్షంలో ఆర్మేనియా-అజర్‌బైజాన్ శాంతి ఒప్పందం.. 35 ఏళ్ల ఘర్షణకు స్వస్తి

Trump7

Trump7

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఆర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అర్మేనియన్ ప్రధాన మంత్రి నికోల్ పషిన్యన్, అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్‌తో కరచాలనం చేసుకున్నారు. ఇద్దరి చేతులను ట్రంప్ కలిపారు. దీంతో 35 ఏళ్ల నుంచి ఉన్న ఘర్షణ ముగిసిపోయింది. అనంతరం ఇద్దరు నాయకులు ట్రంప్‌ను ప్రశంసిస్తూ.. శాంతి బహుమతికి నామినేట్ చేస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Trump-Netanyahu: ఫోన్‌లో ట్రంప్-నెతన్యాహు మధ్య వాగ్యుద్ధం.. ట్రంప్ అరిచినట్లుగా ప్రచారం!

మూడు దశాబ్దాలుగా ఆర్మేనియా-అజర్‌బైజాన్ దేశాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇరు దేశాల నాయకులను ట్రంప్ వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ఇద్దరితో చర్చించాక శాంతి ఒప్పందానికి అంగీకరించారు. దీంతో ట్రంప్ సమక్షంలో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ పరిణామం ట్రంప్ దౌత్యానికి విజయంగా సూచించింది. కొత్త శకానికి నాంది పలికినట్లైంది.

ఇది కూడా చదవండి: Prostitution Racket: భారత్ చూపిస్తామంటూ బంగ్లాదేశీ మైనర్ అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన స్నేహితురాలు!

ఇక ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగాక.. ట్రంప్‌ను శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ నోబెల్ కమిటీకి ఉమ్మడి విజ్ఞప్తిని చేశారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడని తాము భావిస్తున్నట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సమర్థించడమే కాకుండా ప్రోత్సహిస్తామని తెలిపారు.

ఇక ఈనెల 15న అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ సమావేశం అవుతున్నారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రావాలని కోరనున్నారు. అందుకు రష్యా కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే నాలుగేళ్ల యుద్ధానికి ముగింపు దొరికినట్లే అవుతుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యపడలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈసారి శాంతి ఒప్పందం జరగడం ఖాయమని వార్తలు వినిపిస్తు్న్నాయి.

Exit mobile version