Site icon NTV Telugu

Apple: లేఆఫ్స్ జాబితాలోకి ఆపిల్.. ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం..

Apple

Apple

Apple: ఆర్థిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాలతో పలు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు తన ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోత పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులు తొలగించాయి. ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీలు అన్ని పొదుపు చర్యలను పాటిస్తున్నాయి.

Read Also: Mansukh Mandaviya: కరోనా, హార్ట్ ఎటాక్ మధ్య సంబంధం.. కేంద్ర ఆరోగ్యమంత్రి స్పందన ఇదే..

ఇదిలా ఉంటే తాజాగా లేఆఫ్స్ జాబితాలోకి ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ఆపిల్ కూడా చేరబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం పరిమిత సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అయినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ సోమవారం నివేదించింది. అయితే అతి తక్కువ సంఖ్యలో తొలగింపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఆపిల్ స్పందించలేదు. ఆపిల్ డెవలప్మెంట్, ప్రిసెర్వేషన్ టీముల్లోని ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది.

పెరుగుతున్న వడ్దీ రేట్లు, ఆర్థిక మాంద్యం భయాల వల్ల అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి టెక్ కంపెనీలు. ఇప్పటికే ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా రెండు పర్యాయాలుగా వేలల్లో ఉద్యోగులను తీసేసింది. ఈ ఏడాది గత నెలలో 10,000 మందిని, గతేడాది నవంబర్ లో 11,000 మందిని తొలగించింది. అమెజాన్ 18,000 మందిని, గూగుల్ 12,000, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ 50 శాతం మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

Exit mobile version