Apple Watch Saves Woman Life: యువతి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Smartwatch Detects Horrific Killer Tumor And Saves Girl Life: యాపిల్ స్మార్ట్‌వాచ్ ఇప్పటివరకూ ఎందరో ప్రాణాల్ని కాపాడింది. శరీరంలో ఉన్న రోగాల్ని గుర్తిస్తూ.. వాటి నుంచి యూజర్లను బయటపడేసింది. తాజాగా మరోసారి ఈ యాపిల్ స్మార్ట్‌వాచ్ ఇంకో ప్రాణాన్ని కాపాడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన కిమ్ దుర్కీకి యాపిల్ వాచ్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే యాపిల్ వాచ్ కొనుగోలు చేసింది. అంతే, ఇక ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కట్ చేస్తే.. మే నెలలో రాత్రి నిద్రిస్తున్న వేళ ఆ వాచ్ అలెర్ట్ చేసింది. బహుశా అలెర్ట్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఏమైనా మారిపోయాయేమోనని కిమ్ అనుకుంది.
అయితే.. మరుసటి రోజు కూడా ఆ వాచ్ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో కిమ్ తీవ్ర అసహనానికి గురైంది. ఆ యాపిల్ వాచ్ పాడైందేమోననుకొని, విసిరి కొట్టాలని అనుకుంది. కానీ.. ఆ వాచ్ ఎందుకు పదే పదే హెచ్చరికలు జారీ చేసిందన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఓసారి డాక్టర్‌కి చూపిస్తే అయిపోతుంది కదా! అనుకొని, కిమ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు అసలు కథ వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు కిమ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. ఆ యువతి శరీరంలో మైక్సోమా అనే ప్రమాదమైన కణితి ఏర్పడిందని చెప్పారు. ఇది అరుదుగా ఏర్పడుతుంది, శరీరంలో పెరిగితే చాలా ప్రమాదమని, వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలని, లేకపోతే గుండెకు రక్తం సరఫరా ఆగిపోయి హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు తెలిపారు.
Also Read
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
వైద్యులు ఇచ్చిన రిపోర్ట్‌తో ఒక్కసారిగా ఖంగుతిన్న కిమ్ కుటుంబసభ్యులు.. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఐదు గంటలపాటు వైద్యులు శ్రమించి, కిమ్ శరీరం నుంచి ఆ కణితిని తొలగించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ..యాపిల్ వాచ్ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపింది. తొలుత అలెర్ట్ వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే, ఆందోళన వల్ల ఆ అలెర్ట్ వచ్చి ఉంటుందన్నారని చెప్పింది. కానీ, మరోసారి అలెర్ట్ రావడంతో మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించామని, వాళ్లు ట్యూమర్ ఉందని గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!