NTV Telugu Site icon

Amazon River: అమెజాన్ లో నీటి కరువు.. బయటపడిన పురాతన ముఖాలు

Untitled 10

Untitled 10

Amazon River: ప్రకృతి లో సంభవించిన మార్పులు కాలగమనంలో కలిసిపోయిన చరిత్రను వెలికితీసాయి. అందుకేనేమో ఏది జరిగిన మన మంచికే అంటారు పెద్దలు. నీటి కరువు భూస్థాపితం చేయబడిన నిగూడ చరిత్రను ప్రపంచానికి తెలిసేలా చేసింది. వివరాలలోకి వెళ్తే.. బెలీజియంలో తీవ్ర స్థాయి నీటి కరువు సంభవించింది. గతంలో కనీ విని ఎరుగని కరువు ప్రస్తుతం బెల్జియం ను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ నదిలో నీరు చాలా వరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో అమెజాన్ నది నుండి ఆసక్తికర చిత్రాలు బయటపాడ్డాయి. పురాతన మానవ ముఖాలు, అలానే రాతితో చెక్కబడిన ఇతర బొమ్మలు అమెజాన్ నదిలో బయటపడ్డాయి.

Read also:Israel-Hamas conflict: మైసా అబ్దెల్ హదీని ఎందుకు అరెస్ట్ చేసామంటే.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

జంతువులు మరియు ఇతర సహజ రూపాలను వర్ణించే రాతి శిల్పాలు రియో నీగ్రో ఒడ్డున పొంటో దాస్ లాజెస్ అనే పురావస్తు ప్రదేశంలో కనుగొనబడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఒక ఇంటర్వ్యూలో పురావస్తు శాస్త్రవేత్త జైమ్ డి సంటానా ఒలివెరా మాట్లాడుతూ ఈ చిత్రాలు పూర్వాకాలానికి చెందినవని.. వాటి తేదీని ఖచ్చితంగా చెప్పలేము.. కానీ ఈ ప్రాంతాన్ని మానవుల ఎప్పుడు ఆక్రమించ్చారనే ఆధారాల ఆధారంగా అవి సుమారు 1,000 నుండి 2,000 సంవత్సరాల నాటివని మేము విభావిస్తున్నాం అని తెలిపారు. కాగా ఒక ప్రాంతంలో రాతితో చేయబడిన మృదువైన పొడవైన కమ్మీలు బయటపడ్డాయి. దీనితో యూరోపియన్లు రాకముందే స్వదేశీ నివాసులు తమ బాణాలు మరియు స్పియర్‌లను ఉపయోగించారని తెలుస్తుందని పేర్కొన్నారు పరిశోధకులు.