NTV Telugu Site icon

Apple: చైనాకు షాక్ ఇవ్వనున్న ఆపిల్.. భారత్‌కు మంచి అవకాశం

Apple China

Apple China

Amid Protests, Apple Wants To Shift Production Out Of Chinag: చైనాలో జీరో కోవిడ్ రూల్స్ అక్కడి ప్రజలనే కాదు.. అక్కడి పరిశ్రమలను కూడా కలవరపరుస్తున్నాయి. కఠినమైన కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది. దీంతో చైనా నుంచి పరిశ్రమలు ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా ఆపిల్ కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మరేదైన ఆసియా దేశంలో ఆపిల్ ఉత్పత్తిని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లేదా వియత్నాం దేశాలకు వళ్లే ఆలోచనలో ఉంది.

Read Also: IND Vs BAN: నేడు తొలి వన్డే.. టీమిండియా జట్టు కూర్పు ఎలా ఉంటుంది?

చైనా ప్రభుత్వం ‘జీరో కోవిడ్ టాలరెన్స్’ వల్ల ఆపిల్ కంపెనీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కారణం అవుతోంది. చైనాలో కోవిడ్ రూల్స్ వల్ల జెంగ్జౌ ఐఫోన్ సిటీలో ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. నవంబర్ చివరలో ఫాక్స్కాన్ ఫ్లాంట్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ కర్మాగారంలో నిరసనలు జరగడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ లాక్డౌన్ లో ఉన్న కార్మికులు పారిపోవడం వంటి ఘటనలను జరిగాయి. జెంగ్జౌలో ఐఫోన్లు, ఆపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో దాదాపుగా 3 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ప్రకటించింది. జెంగ్జౌలో ఉన్న ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ అసెంబ్లీ యూనిట్, చైనా కోవిడ్ నియమాల వల్ల ప్రభావితం అయింది. కఠిన ఆంక్షల కారణంగా తయారీ సామర్థ్యం దెబ్బతింది. దీంతో వీటి సరఫరా ఆలస్యం అయింది.

ఇదిలా ఉంటే ఆపిల్ తయారీ భాగస్వాములు చైనా వెలుపల పనిచేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపిస్తుండటంతో ఆపిల్ చైనాను వదిలివేయాలని భావిస్తోంది. కోవిడ్ కఠిన నిబంధనల వల్ల ప్రొడక్షన్ దెబ్బతినడంతో ఆపిల్ ఈ దిశగా ఆలోచిస్తోంది. ఆసియాలోని భారతదేశం, వియత్నాం దేశాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనా ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నా.. ఒక్క భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే పటిష్టంగా ఉంటుందని పలు ఇంటర్నేషనల్ సంస్థలు వెల్లడించాయి. ఒక వేళ ఆపిల్ కనుక ఇండియాకు వస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బూస్ట్ అయ్యే అవకాశం ఉంది.