NTV Telugu Site icon

UK: సూర్యుడు అస్తమించని అగ్రరాజ్యం.. ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది..

Uk

Uk

High Inflation In UK: ఒకప్పుడు సూర్యడు అస్తమించన రాజ్యంగా పేరు తెచ్చుకున్న యునైటెడ్ కింగ్‌డమ్‌(యూకే) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. అధిక ద్రవ్యోల్భణం అక్కడి ప్రజలను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. యూకేలోని ప్రతీ ఏడుగురు వ్యక్తుల్లో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని, గతేడాదిగా ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఆకలి కేకల్ని ఎదుర్కొంటున్నారని ఫుడ్ బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ ట్రస్సెల్ ట్రస్ట్ బుధవారం ప్రచురించిన నివేదిక వెల్లడించింది.

యూకేలో మొత్తం 11.3 మిలియన్ల మంది ఆకలిని ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇది స్కాట్కాండ్ జనాభా కన్నా రెట్టింపు కంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓ నివేదిక ప్రకారం యూకే జీడీపీకి సమానంగా ఆ దేశ అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ద్రవ్యోల్భణం, నిత్యావసరాల ధరల కారణంగా ఒక ఏడాదిగా అక్కడి ప్రజలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్భణం దాదాపుగా అందరు కార్మికులు వేతన వృద్ధిని అధిగమించింది.

Read Also: Keerthy Suresh: బ్లాక్ కలర్ డ్రెస్సులో హాట్ బాంబ్ లా కీర్తి సురేష్.. ఫొటోలు చూశారా?

యూకేలో ట్రస్సెల్ ట్రస్ట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న 1300 ఫుడ్ బ్యాంక్ సెంటర్లలో మార్చి వరకు రికార్డు స్థాయిలో 3 మిలియన్ ఆహార ప్యాకెట్లను అందించింది. ఇది గతంతో పోలిస్తే 37 శాతం పెరిగింది. ఐదేళ్ల క్రితం గణాంకాలతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. జీవన వ్యయ సంక్షోభం, మహహ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యూకే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. యూకే జనాభాలో 7 శాతం మంది ఆహార బ్యాంకులతో సహా చారిటబుల్ ఫుడ్ సపోర్టు ద్వారా బతుకీడుస్తున్నారు.. ఇంకా 71 శాతం మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది.

ఫుడ్ నెట్వర్క్ ని ఆశ్రయిస్తున్న ఐదుగురిలో ఒకరు పనిచేసే కుటుంబం నుంచి ఉంటున్నారని తెలిపింది. ప్రజలు కష్టపడుతున్నారని మాకు తెలుసని, ఒక్కో ఇంటికి సగటున 3,300 పౌండ్ల విలువైన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్‌ల ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రయోజనాలు మరియు రాష్ట్ర పెన్షన్‌ను కూడా పెంచింది, కనీస వేతనాన్ని పెంచింది మరియు ఆహారం, శక్తి మరియు ఇతర అవసరమైన ఖర్చులతో కుటుంబాలను ఆదుకుందని ఆయన తెలిపారు.