Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌నకు హష్ మనీ కేసులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు రిలీఫ్ కల్పించాలని ట్రంప్ తాజాగా కోర్టును కోరారు. కానీ, ఆయన చేసిన ఈ విజ్ఞప్తిని న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. అధ్యక్షులకు రక్షణ అధికారిక చర్యలకు మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా జడ్జ్ జువాన్ మర్చన్ స్పష్టం చేశారు. అనధికార ప్రవర్తనకు రక్షణ వర్తించదని పేర్కొన్నారు.
Read Also: Prakash Raj : మరోసారి రెస్పాన్సిబుల్ ఫాదర్ రోల్లో వర్సటైల్ యాక్టర్
అయితే, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ఏకాంతంగ గడిపి ఈ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు డొనాల్డ్ ట్రంప్ అనధికారికంగా చెల్లింపులు చేశారని ఆయనపై నమోదైన కేసు రుజువైంది. ఈ కేసులో ట్రంప్ దోషిగా రుజువైనప్పటికీ శిక్ష ఇంకా ఫిక్స్ కాలేదు. కాగా, ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ జనవరి 20వ తేదీన రెండోసారి యూఎస్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.