America vs Iran: ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యూఎస్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై తన ఆంక్షలను విస్తరించింది అమెరికా. ఇటీవల ఇజ్రాయెల్‌పై బాలస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Honeymoon Express: ఆహాలో ట్రెండింగ్‌గా హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ
కాగా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా.. నిధులు సమకూర్చి, అస్థిరపరిచే కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని మరింత భంగపరిచేందుకు అమెరికా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై ఆంక్షలను విస్తరించినట్లు ట్రెజరీ డిపార్టుమెంట్ చెప్పుకొచ్చింది. అలాగే, ఈ క్రమంలోనే 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించింది. ఇవి, నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి సపోర్టుగా ఇరానియన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పించింది.
Read Also: Donald Trump: అమెరికా ప్రజలను చంపిన వలసదారులకు మరణశిక్ష విధిస్తా..
ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో ఇరాన్ పెద్ద తప్పు చేసింది.. దీనికి మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఇరాన్‌కు చెందిన చమురు, అణు స్థావరాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందా అనే అనుమానం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై దాడికి ప్రత్యమ్నాయం ఆలోచించాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఉన్న ఆంక్షలను యూఎస్ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది.