NTV Telugu Site icon

Corona Vaccine: అమెరికా కీలక నిర్ణయం.. 6 నెలల పసికందులకు కరోనా టీకా

Vaccine

Vaccine

ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు శుక్రవారం ఆమోదం లభించింది. . టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. పసికందులకు కరోనా టీకా కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని.. ఈ నిర్ణయంతో ఆరు నెలల చిన్నారులను కరోనా నుంచి రక్షించడంలో వ్యాక్సినేషన్ తోడ్పడుతుందని ఎఫ్‌డీఏ చీఫ్ రాబర్ట్‌ కలిఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై కొవిడ్‌-19 కారణంగా చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేరడం, మరణాలు సంభవించడం వంటి వాటి నుంచి ఇవి పూర్తి రక్షణ కల్పిస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

అమెరికాలో ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌లను వేల మంది చిన్నారులపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. పెద్దవారిలో వచ్చిన మాదిరిగానే వారిలోనూ తేలికపాటి దుష్ప్రభావాలు తలెత్తగా… అదేస్థాయిలో యాంటీబాడీలు కూడా ఉత్పత్తి అయ్యాయి. కాగా.. ఆరు నెలల చిన్నారులకు ఇచ్చే టీకా.. పెద్దలకు ఇచ్చే దానిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఫైజర్‌ గతంలో తెలిపింది. అదేవిధంగా మోడెర్నా రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో మెరుగైన రక్షణ లభించిందని.. కొన్ని కేసుల్లో మాత్రమే ఫైజర్‌ టీకా పూర్తి రక్షణ ఇవ్వలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్‌ బూస్టర్ డోస్‌తో పూర్తి రక్షణ లభిస్తుందని నివేదించింది. అందుకోసమే ఫైజర్‌ బూస్టర్‌ డోస్‌ను ఇవ్వాల్సిందిగా నిర్ణయించారు.

Agnipath Scheme: వాట్సప్ చాటింగ్ లలో అల్లర్లకు ప్లాన్.. పెట్రోల్ బాటిల్ తో.. రావాలంటూ ఆదేశాలు