Ali Khamenei Funeral: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ గైర్హాజరు.. ఇజ్రాయిల్ భయమే కారణమా.?
- అలీ ఖమేనీ అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ మిస్సింగ్..
- ఇజ్రాయిల్ భయం, భద్రతా కారణాల వల్లే గైర్హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ali Khamenei Funeral: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆయన ముగ్గురు కుమారుడు మోస్తఫా ఖమేనీ, మేసమ్ ఖమేనీ, మసూద్ ఖమేనీ హాజరయ్యారు. ఆయన వారసుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అంత్యక్రియలకు గైర్హాజరయ్యారు. మొజ్తాబా ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. జూలై 9న మష్హద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో అలీ ఖమేనీకి అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఆ కార్యక్రమానికి మొజ్తబా ఖమేనీ హాజరయ్యే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇమామ్ ఖోమేనీ గ్రాండ్ మోసల్లాలో జరిగిన అంత్యక్రియాల్లో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) కమాండర్ అహ్మద్ వహీది సహా పలువురు కీలక వ్యఖ్యలు పాల్గొన్నారు. ఖమేనీ శవపేటికతో పాటు ఆయనతో పాటు దాడిలో మరణించిన ఇతర కుటుంబ సభ్యుల శవపేటికలు కూడా ఉంచారు. ఇందులో 14 నెలల మనవరాలి శవపేటికను చూసి చాలా మంది ఇరాన్ ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సంతాప కార్యక్రమాల్లో కోటి మందికి పైగా ప్రజలు పాల్గొంటారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Lakshmi Mittal Steel Plant: లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
- Iran Commander: ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా చంపినా 30,000 డాలర్ల బహుమతి
- Donald Trump: కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
కొత్తగా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిని మొజ్తాబా ఖమేనీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో తండ్రి చనిపోవడంతో పాటు మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయిల్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
-
Rainbow Children’s Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
-
West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
-
Buchi Babu Sana: రవి తేజ కోసమే తొలి కథ రాశా.. ‘ఇరుముడి’ ఈవెంట్లో బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?