ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయింది. మహిళలకు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. అయితే, ఇస్లామిక్ చట్టాల ప్రకారమే వారికి అవకాశం ఉంటుందని తాలిబన్లు చెబుతున్నారు. ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్టు ఇప్పటికే తాలిబన్లు ప్రకటించినా, భయాందోళనలు ఏ మాత్రం తొలగిపోలేదు. ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, కొంత మంది మహిళలు కాబూల్‌లో ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నిలబడి నిరసనలు తెలిపారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అలాంటి కాబూల్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా, మహిళలకు స్వేచ్చ కల్పించాలని, అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకొని నిలబడడం అంటే ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే. తాలిబన్ల చేతిలో ఎలాగైనా, ఎప్పటికైనా చనిపోతామని, అలాంటప్పుడు తాలిబన్ చట్టాలకు వ్యతిరేకంగా మార్పును కొరుకుంటూ చనిపోవడం మంచిదని అక్కడి మహిళలు అభిప్రాయపడుతున్నారు.
ప్రాణాలకు తెగించి ఆఫ్ఘన్ మహిళలు ఏం చేశారంటే…
