NTV Telugu Site icon

Afghanistan: బొమ్మైనా సరే ముఖానికి ముసుగు ఉండాలి.. మహిళలపై తాలిబన్లు ఆంక్షలు

Cover Female

Cover Female

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. పురుషులు లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు రాకూడదని, బురఖా ధరించాలని, బాలికల సెకండరీ స్కూళ్లను మూసివేయాలని, మహిళలు ఉద్యోగం చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన తాలిబాన్ నేతలు దేశంలోని మహిళలకు యూనివర్సిటీ విద్యను కూడా నిషేధించారు.

ఇటీవల ఆఫ్ఘన్ నాయకులు మహిళల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలిపే కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ దేశంలో ఆడవాళ్ళే కాదు.. స్త్రీని పోలిన బొమ్మైనా సరే ముఖం కనిపించకూడదనే నిబంధనలు పెట్టారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా దుకాణదారులకు ఆదేశాలు జారీ చేసింది. బట్టల దుకాణాల ముందు షాపులో ముందు, లోపల మహిళల బొమ్మలు, ముఖాలు కనిపించకుండా తప్పనిసరిగా బురఖా ధరించాలని స్పష్టం చేశారు. దీంతో ఆయా దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు, గుడ్డ సంచులతో బొమ్మల ముఖాలను కప్పి ఉంచుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nagoba Jatara: వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర.. నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు