Afghan-Pak War: పాక్‌పై తాలిబన్ సైన్యం మెరుపుదాడులు.. వీడియో విడుదల

  • పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
  • పాక్‌పై తాలిబన్ సైన్యం మెరుపుదాడులు
  • వీడియో విడుదల
Afghanpakwar

Afghanpakwar

పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా అది మరింత తీవ్రమైంది. ఆ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో యుద్ధానికి దిగాయి. పాకిస్థాన్ జరిపిన దాడులకు ఆప్ఘనిస్థాన్ కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్ఘనిస్థాన్ విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

ఆఫ్ఘనిస్థాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్‌పై జరిపిన వైమానిక దాడుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా గురు, శుక్రవారం దాడులు చేసినట్లుగా తెలిపింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ యుద్ధ విషయంలో జోక్యం చేసుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ తనకు బాగా తెలుసు అన్నారు.