Afghanistan comments on Masood Azhar and pakistan: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. జైషే చీఫ్ మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్ లోని నంగర్ హార్ ప్రావిన్స్ ప్రాంతంలో ఎక్కడో ఓ చోట తలదాచుకున్నాడని.. అతన్ని పాకిస్తాన్ కు అప్పగించాలని కోరుతూ.. పాకిస్తాన్ విదేశాంగా శాఖ ఆఫ్ఘనిస్తాన్‌కు లేఖ రాసింది. అతన్ని పట్టుకుని పాకిస్తాన్ దేశానికి అప్పగించాలని కోరింది. అయితే ఈ పాకిస్తాన్ వాదనలను తప్పి కొట్టింది తాలిబాన్ ప్రభుత్వం. ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు పాకిస్తాన్ మాత్రమే పురిటిగడ్డ అని.. అక్కడి అధికారిక ప్రోత్సాహంతోనే ఉగ్రవాద సంస్థలు పనిచేస్తాయని తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తీవ్ర పదజాాతంలో పాకిస్తాన్ పై విరుచుకుపడ్దారు.
ఆఫ్ఘనిస్తాన్ టోలో న్యూస్ ఇంటర్వ్యూలో ముజాహిద్ మాట్లాడుతూ.. మీడియాలో వచ్చిన వార్తలను చూశానని.. పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్లు ఇది నిజం కాదని ఆయన అన్నారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేరని ఆయన అన్నారు. ఆఫ్ఘానిస్తాన్ గడ్డను మరే ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించుకునేందుకు అనుమతించమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ లో మాత్రమే ఉంటారని ఆయన అన్నారు.
Read Also: Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం
మసూద్ అజార్ భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. 1999లో కాఠ్మాండు, న్యూడిల్లీ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసినప్పుడు.. భారత్ ఇతన్ని విడుదల చేసింది. అప్పటి నుంచి భారత్ కు వ్యతిరేకంగా పలు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఆ సమయంలో ఇండియాలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ నగరానికి తీసుకెళ్లారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం మసూద్ అజార్ తో పాటు మరి కొందర్ని విడుదల చేసింది.
2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడికి మసూద్ అజారే కీలక సూత్రధారి. ఆ తరువాత పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను నిషేధించింది. 2019 మేలో ఐక్యరాజ్యసమితి మసూద్ అజార్ ను ‘ గ్లోబల్ టెర్రరిస్టు’గా ప్రకటించింది. మసూద్ అజార్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరుపుతున్నాడు.
